NTV Telugu Site icon

AP Crime: బెయిల్‌పై జైలు నుంచి వచ్చాడు.. కోరిక తీర్చేందుకు తిరస్కరించిన మహిళ గొంతు కోశాడు..

Crime

Crime

AP Crime: రెండు రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు.. తనలైంగిక వాంఛ తీర్చాలంటూ ఓ వివాహితపై ఒత్తిడి తెచ్చాడు.. అందుకు ఆ వివాహిత మహిళ తిరస్కరించడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన కామాంధుడు.. కత్తితో వివాహతపై దాడి చేశాడు.. ఈ ఘటన అనకాపల్లి జిల్లాలో కలకలం సృష్టించింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రోలుగుంట మండలం, బలిజపేటకు చెందిన వివాహితపై కోడి రమణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో వివాహిత మెడపై గాయం అయ్యింది.. ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు రమణ.. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం నిందితుడు, బాధితురాలు ఇద్దరూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.

Read Also: TSPSC Group 4: గ్రూప్ 4 పరీక్షా తేదీ ఖరారు..

ఇంతకీ, ఆ వివాహితపై దాడి ఎందుకు చేశాడనే వివరాల్లోకి వెళ్తే.. గంజాయి కేసులో అరెస్ట్‌ అయిన రమణకు జైలు శిక్ష పడింది.. అయితే, సోమవారమే బెయిల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు.. జైలుకు వెళ్లి వచ్చినా.. అతడి బుద్ధిమాత్రం మారలేదు.. శారీరకంగా తన కోర్కెను తీర్చాలంటూ వివాహితను బెదిరించాడు.. కానీ, అతడి కోర్కెను తీర్చేందుకు వివాహిత తిరస్కరించింది.. దీంతో.. ఒక్కసారిగా ఆమెపై కత్తితోదాడికి దిగాడు.. ఈ ఘటనలో ఆమె మెడపై గాయం అయ్యింది.. ఆ తర్వాత భయాందోళనకు గురైన రమణ.. పురుగుల మందు తాగి తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.. ప్రస్తుతం ఇద్దరూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రమణపై 309,307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు.. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న ఇద్దరినీ పరామర్శించారు ఎస్పీ గౌతమశాలి.

Show comments