Site icon NTV Telugu

Weather Alert : సముద్రం అల్లకల్లోలం.. జాలర్లు వేటకు వెళ్లొద్దు..

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుడం కొనసాగుతోంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది. ఇది సాయంత్రం వరకు తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వచ్చే అవకాశం ఉంది.

దీని కారణంగా తమిళనాడు, కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వ్యాపించనున్నాయి. అంతేకాదు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కనుక రేపటి వరకూ జాలర్లు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్ళవొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 13 కి.మీల వేగంతో వాయుగుండం ఉత్తర దిశగా కదులుతుందని తెలిపారు. సాయంత్రం తమిళనాడు తీరానికి మరింత దగ్గరగా వాయుగుండం వచ్చే అవకాశం ఉందని తెలియజేసింది.

https://ntvtelugu.com/another-629-students-arrived-in-delhi/
Exit mobile version