Site icon NTV Telugu

Love Turns Tragedy: పెళ్లయ్యాక అతనితో ఎఫైర్.. లాడ్జిలో షాకింగ్ దృశ్యం

Lovers Commits Suicide

Lovers Commits Suicide

Lovers Commits Suicide In TIrupati Lodge: ప్రేమించుకున్న ఓ జంటను కులం విడదీసింది కానీ, వారి మనసుల్ని మాత్రం వేరు చేయలేకపోయింది. వారి మధ్య ప్రేమను చెరపలేకపోయింది. అందుకే.. వేర్వేరుగా ఉండలేక, కలిసి చనిపోవాలని ఆ జంట నిర్ణయించుకుంది. ఈ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌‌కు చెందిన అనూష(21)కు రెండేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుడ్ల పోసిబాబుతో వివాహంతో జరిగింది. ఈ జంట కొవ్వూరులో నివాసం ఉంటోంది.

అయితే.. అనూష పెళ్లి కాకముందే షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావుతో ప్రేమ వ్యవహారం నడిపింది. వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుని, తమ పేరెంట్స్‌కి విషయం చెప్పారు. కానీ, కులాలు వేరు కావడంతో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే అనూషకు రెండేళ్ల క్రితం పోసిబాబుకి వివాహం జరిపించారు. పెద్దల ఒత్తిడితో అనూష అయిష్టంగానే ఆ పెళ్లి చేసుకుంది. కానీ, కృష్ణారావుని మరువలేకపోయింది. అందుకే, పెళ్ళైనా అతనితో అనుబంధం కొనసాగించింది. కానీ, ఎన్నాళ్లిలా కలుసుకుంటాం? జీవితాంతం కలిసి ఉండలేం కదా! అని ఆ జంట అనుకుంది. దీంతో.. చావులోనైనా కలిసుందామని నిర్ణయించుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈనెల 5వ తేదీన ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లారు. అక్కడ త్రిలోక్‌ లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే.. అక్కడే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం ఉదయం వాళ్లు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో.. లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అటు.. ఈనెల 5న తన భార్య కనిపించడం లేదని పోసిబాబు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే తిరుపతిలోని లాడ్జిలో అనూష ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకొని, విషయం కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

Exit mobile version