Site icon NTV Telugu

Floods Live Updates: తెలుగు రాష్ట్రాలలో భారీ వరదలు

Kcr And Governer Min

Kcr And Governer Min

తెలుగు రాష్ట్రాలలో గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుతోంది. అయినా ఇంకా చాలా ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకే రోజు భద్రాచలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

The liveblog has ended.
  • 18 Jul 2022 08:03 AM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల మోస్తారు వర్షం పడే అవకాశం వుంది. ప్రాజెక్టుల్లోకి ఇన్ ఫ్లో కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా ఇన్ ఫ్లో. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న అధికారలు. ఇన్ ఫ్లో 3500 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో 28500 క్యూసెక్కులు. స్వర్ణ ప్రాజెక్టు ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్న అధికారులు. ఇన్ ఫ్లో 3200 c/s. అవుట్ ఫ్లో 4420 c/s. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల ప్రాజెక్టు ఒక్క గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 525 c/s, అవుట్ ఫ్లో 525c/s కా కొనసాగుతుంది.

  • 18 Jul 2022 08:00 AM (IST)

    మహబూబ్ నగర్ జూరాలకు పోటెత్తిన వరద

    మహబూబ్ నగర్ జూరాలకు వరద పోటెత్తుతుంది. 23 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ ఫ్లో 1,76,000 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,74,383 వేల క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు, ప్రస్తుత నీటిమట్టం 1,042.585 ఫీట్లు, పూర్తి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ: 8.280 టీఎంసీలు, 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి.

  • 18 Jul 2022 07:59 AM (IST)

    నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

    కామారెడ్డి జిల్లా, జుక్కల్, నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ఇన్ ఫ్లో 1960వేల క్యూసెకులు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 1400.08 అడుగులు, నీటి సామర్థ్యం 17.802 టీఎంసీ లు, ప్రస్తుతం 11.447టీఎంసీలుగా కొనసాగుతుంది.

  • 18 Jul 2022 07:32 AM (IST)

    ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద

    ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద తగ్గుతుంది. బ్యారేజ్ నీటిమట్టం 20.2 అడుగులు, వరద ప్రవాహం 23.30 లక్షల క్యూసెక్కులు, మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

  • 17 Jul 2022 09:51 PM (IST)

    శ్రీశైలం జలాశయానికి మళ్ళీ పెరిగిన వరద

    ఇన్ ఫ్లో : 3,22,946 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో : 33,384 క్యూసెక్కులు

    పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

    ప్రస్తుతం : 862 అడుగులు

    పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

    ప్రస్తుతం : 112.4632 టీఎంసీలు

    తెలంగాణ విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 17 Jul 2022 08:01 PM (IST)

    హైదరాబాద్ లో వాన

    హైదరాబాద్ నగరంలో పలుచోట్ల వర్షం. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ , టోలిచౌకి, మణికొండ, గచ్చిబౌలి, లింగంపల్లిలో వర్షం.జలమయం అయిన రహదారులు.

  • 17 Jul 2022 07:52 PM (IST)

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

    ఇన్ ఫ్లో : 3,05,897 క్యూసెక్కులు

    ఔట్ ఫ్లో : 27,027 క్యూసెక్కులు

    పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

    ప్రస్తుతం : 861.40 అడుగులు

    పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

    ప్రస్తుతం : 110.3410 టీఎంసీలు

    తెలంగాణ విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 17 Jul 2022 07:52 PM (IST)

    సుంకేసుల ప్రాజెక్టుకు వరద వెల్లువ

    సుంకేసుల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం

    ఇన్ ఫ్లో 1,53,643 క్యూసెక్కులు

    అవుట్ ఫ్లో 1,52,585 క్యూసెక్కులు

    27 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల

    కెసి కాలువకు 1,058 క్యూసెక్కుల నీటి విడుదల

    డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసి

    ప్రస్తుత సామర్థ్యం. 0.378 టిఎంసి

  • 17 Jul 2022 05:58 PM (IST)

    అధికారులపై సీఎం కేసిఆర్ ఫైర్

    ములుగు జిల్లాలో కేసీఆర్ బిజీబిజీగా వున్నారు. ఏటూరునాగారం సమీక్షలో అటవీశాఖ అధికారులపై సీఎం కేసిఆర్ ఫైర్ అయ్యారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో దొంగలు తయ్యారయ్యారు.అన్ని అమ్ముకదొబ్బారు.ఒక్క చెట్టు అయినా ఉందా? ములుగు డిఎఫ్వో ప్రదీప్ కుమార్ శెట్టిని మందలించిన సీఎం కేసీఆర్. అటవీప్రాంతం లో రోడ్డు వేయనీయం, బ్రిడ్జి కట్టనీయం, కరెంట్ పోల్ వేయనీయకపోవడం మంచిదికాదు.బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారు.రోడ్డు సౌకర్యం లేక రేషన్ ఇవ్వలేక కలెక్టర్, ప్రజలు చావాలా?వెరీ సారీ, మంచి పద్దతి కాదని డిఎఫ్వో ను మందలించిన సీఎం కేసిఆర్

  • 17 Jul 2022 05:27 PM (IST)

    సీఎం కేసీఆర్ సమీక్ష

    ఏటూరునాగారంలో వరద పరిస్థితులపై మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తున్నారు సీఎం కేసీఆర్.

  • 17 Jul 2022 05:26 PM (IST)

    భద్రాచలంలో వరద ఉధృతి

    సాయంత్రం 5 గంటల నాటికి ....

    భద్రాచలం వద్ద 60.60 అడుగులు

    18,20,392 క్యూసెక్కులు విడుదల

    మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు

    రెండవ ప్రమాద హెచ్చరిక:- 48 అడుగులు

    మూడవ ప్రమాద హెచ్చరిక: 53.00 అడుగులు

  • 17 Jul 2022 05:12 PM (IST)

    యానాంలో నీటమునిగిన కాలనీలు

    భారీ వర్షాలు, గోదావరి ఉగ్రరూపంతో యానాం లో వరదతో నీట మునిగాయి కాలనీలు. వృద్ధులు, మహిళలను షిఫ్ట్ చేయడానికి అవస్థలు పడుతున్నారు. ఎవరు లేని వారి పరిస్థితి మరింత అధ్వాన్యంగా వుంది. నీట మునిగిన పార్కింగ్ లో ఉన్న వాహనాలు పాడవుతాయని యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే ఫస్ట్ ఫ్లోర్ లలోకి కూడా వరద నీరు వెళ్లే అవకాశం వుందంటున్నారు.

  • 17 Jul 2022 04:35 PM (IST)

    ఐటీడీఏ ఆఫీసుకి చేరుకున్న కేసీఆర్

    వరంగల్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఐటీడీఏ ఆఫీసుకి చేరుకున్నారు. ములుగు జిల్లా ముంపు పైనా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. అంతకుముందు రామన్నగూడెం లో గోదావరి వరద బాధితులను పరామర్శించారు సీఎం కేసిఆర్.ప్రతి సంవత్సరం వరద సమస్య ఉందని తెలిపారు ఎస్సీ ఎస్టీ కాలనీ వాసులు. సమస్యను పరిశీలించాను. శాశ్వతంగా ముంపు సమస్యను పరిష్కరిస్తాం. వచ్చే సంవత్సరం నుంచి వరద ముంపు సమస్య ఉండదన్నారు సీఎం కేసీఆర్. మీరంత బాగుండాలన్నారు కేసీఆర్.

  • 17 Jul 2022 03:40 PM (IST)

    గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కేసీఆర్

    ఏటూరునాగారంలో మధ్యాహ్న భోజనం అనంతరం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు సీఎం కేసీఆర్.. ముంపు ప్రాంతాల్లో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు కేసీఆర్. అనంతరం ఏటూరునాగారం ITDA కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేపడతారు. భారీ వర్షం నేపథ్యంలో ఏటూరునాగారం నుండి రోడ్డు మార్గంలో హనుమకొండ చేరుకుంటారు ముఖ్యమంత్రి. ఇవాళ  రాత్రి హనుమకొండ లో బస చేసే అవకాశం వుంది.

  • 17 Jul 2022 03:10 PM (IST)

    వీఆర్వోకి తప్పిన ప్రమాదం

    కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లో మహిళా వీఆర్ వో గొల్లం మందల లక్ష్మీ కుమారికి ప్రమాదం తప్పింది. వరద బాధితులను తరలించేందుకు నాటు పడవ ఎక్కిన వీ ఆర్ వో వరద నీరు వడిగా ప్రవహించడంతో తిరగబడి పోయింది పడవ. పడవ తిరగబడడంతో వరద నీటిలో మునిగి పోతున్న మహిళా వీఆర్ వోని హుటాహుటిన రక్షించిన స్థానికులు.

  • 17 Jul 2022 02:28 PM (IST)

    ఏటూరునాగారం చేరుకున్న సీఎం కేసీఆర్

    ఏటూరునాగారం చేరుకున్న సీఎం కేసీఆర్.. గోదావరికి శాంతి పూజలు నిర్వహించారు. ఏటూరునాగారం చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రి సత్యవతి, స్థానిక నేతలు స్వాగతం పలికారు. రామన్నగూడెం దగ్గర గోదావరికి శాంతి పూజలు చేయనున్న సీఎం. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించనున్న సీఎం. వరద బాధితులను పరామర్శించనున్న సీఎం. ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షలో సీఎం పాల్గొననున్నారు.

  • 17 Jul 2022 01:33 PM (IST)

    వరద బాధితులకు రూ.1000 కోట్లతో శాశ్వత కాలనీలు

    తెలంగాణ సీఎం కేసీఆర్ భద్రాచలం ముంపు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా.. సీఎం కేసీఆర్ మాట్లాడారు. బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తామని, శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల‌కు ఎత్తైన ప్ర‌దేశంలో రూ.1000 కోట్ల‌తో కొత్త కాల‌నీ నిర్మిస్తామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. 7,274 కుటుంబాల‌ను జిల్లా యంత్రాంగం పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించింద‌ని కేసీఆర్ చెప్పారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు.

  • 17 Jul 2022 12:57 PM (IST)

    వరద బాధితులకు రూ.10వేలు సాయం -సీఎం కేసీఆర్

    వరద బాధితులకు తక్షణ సాయం కింద కుటుంబానికి రూ.10వేలు సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రెండు నెలల పాటు 20 కిలోల చొప్పున ఉచిత బియ్యం ఇస్తామని తెలిపారు. దేవుడి దయ వల్లే కడెం ప్రాజెక్టు సేఫ్‌గా ఉందని సీఎం కేసీఆర్ పర్కొన్నారు. ఈనెల 29 వరకు ప్రతిరోజు వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ చెప్తోందని, కాబట్టి వరద ముప్పు తొలగిపోలేదని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

  • 17 Jul 2022 12:55 PM (IST)

    దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వెనుక కుట్రలు -సీఎం కేసీఆర్

    దేశంలో క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. దీని వెనుక కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు సీఎం. ఇతర దేశాల వాళ్లు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.. గతంలో లేహ్‌లో కూడా ఇలా చేశారని, ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్ చేశారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

  • 17 Jul 2022 12:54 PM (IST)

    గతంలో ఎన్నడూలేని విధంగా వరదలు -సీఎం కేసీఆర్

    గతంలో కనీవినీఎరగని విధంగా వరదలు చూస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. వరదలతో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. గోదావరిలో వదరనీరు 50 అడుగులు వచ్చినా కొన్ని కాలనీలు నీటమునుగుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

  • 17 Jul 2022 12:49 PM (IST)

    ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు- సీఎం కేసీఆర్

    భద్రాచలం ముంపు బాధితులకు శాశ్వత కాలనీలు నిర్మిస్తాం.. శాశ్వత కాలనీల కోసం అధికారులు ఎత్తయిన ప్రదేశాలను గుర్తించాలని పేర్కొన్నారు. వరదలు వచ్చినప్పుడల్లా ప్రజలు ముంపునకు గురికావడం బాధాకరమని సీఎం అన్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది.

  • 17 Jul 2022 12:19 PM (IST)

    ముంపు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా- తమిళసై

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్​ పర్యటించారు. అశ్వాపురం మండలం బట్టీల గుంపు వద్ద బాధితులతో ఆమె మాట్లాడారు. ఆ ప్రాంతానికి చెందిన సర్పంచ్‌లు తమ సమస్యలపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అశ్వాపురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని తమిళిసై సందర్శించారు. ముంపు బాధితుల సమస్యలు విన్నాను, వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సాయంత్రం చింతిర్యాల, గౌతమినగర్‌ ప్రాంతాల్లో ఆమె పర్యటించి, వరద సహాయక సామగ్రిని అందజేయనున్నారు.

  • 17 Jul 2022 11:24 AM (IST)

    గంగమ్మకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

    సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. గోదావరి బ్రిడ్జిపై గంగమ్మకు కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసారు. గోదావరి ప్రవాహం, పరిసర ప్రాంతాలను కేసీఆర్ పరిశీలించారు.

  • 17 Jul 2022 11:22 AM (IST)

    భద్రాచలం చేరుకున్న కేసీఆర్

    తెలంగాణ సీఎం సీఆర్ భ‌ద్రాచ‌లం చేరుకున్నారు.  ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గోదావ‌రి న‌దికి సీఎం కేసీఆర్ శాంతి పూజలు నిర్వ‌హించారు. వంతెన పైనుంచి గోదావ‌రి నది ప‌రిస‌ర ప్రాంతాలను ప‌రిశీలించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు పువ్వాడ అజ‌య్ కుమార్, హ‌రీష్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వతి రాథోడ్‌ సహా ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

  • 17 Jul 2022 11:09 AM (IST)

    Live: ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్

     

  • 17 Jul 2022 11:08 AM (IST)

    కాసేపట్లో భద్రాచలం చేరుకోనున్న కేసీఆర్

    వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తారు.

  • 17 Jul 2022 10:21 AM (IST)

    వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై

    వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళసై పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం చినపాక నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శిస్తున్నారు. వరద బాధితులకు భరోసా కల్పించేందుకు తాను పర్యటించడం జరుగుతోందని తమిళిసై వెల్లడించారు. వరద బాధితులతో మాట్లాడుతూ.. వారికి నిత్యావసరాలు, మందులు పంపిణీ చేసారు. గవర్నర్ వెంట రెడ్ క్రాస్, ఈఎస్ఐ డాక్టర్ల టీమ్ ఉంది. మణుగూరు పర్యటన అనంతరం నేరుగా భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకోనున్నారు.

  • 17 Jul 2022 09:59 AM (IST)

    వాన పడుతున్న ముంపు ప్రాంతాలకు సీఎం కేసీఆర్

    గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన బయల్దేరిన ముఖ్యమంత్రి ఏటూరు నాగారం మీదుగా భద్రాచలం వెళ్తున్నారు.

  • 17 Jul 2022 09:57 AM (IST)

    గోదావరి వరద ఉధృతికి నీట మునిగిన రాజమండ్రి

    గోదావరి వరద ఉధృతికి రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జల దిగ్బంధంలో ఆర్యాపురం గ్రామస్తులు. గోదావరి నీటి మట్టం పెరగడంతో నల్లఛానల్ గేట్లు మూసివేసారు అధికారులు. గోదావరిలోకి వెళ్లే మార్గం లేక నగరంలో మురికి నీరు వెనక్కి వస్తోంది.

  • 17 Jul 2022 09:42 AM (IST)

    గోదావరి ఉధృతి.. కోతగరవుతున్న నరసాపురం కరకట్ట

    పశ్చిమగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతికి నరసాపురం కరకట్ట కోతగరవుతుంది. నరసాపురం లాకుపేట వద్ద లాకులు దాటి ప్రవహిస్తున్న గోదావరి వరదనీరు. అడ్డుకట్ట వేసేందుకు రెండుసార్లు ప్రయత్నాలు చేసి విఫలమైన అధికారులు. ప్రమాద ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.

  • 17 Jul 2022 09:41 AM (IST)

    కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి పోటెత్తిన వరద

    కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతుంది. 30 గేట్ల ద్వారా వరద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 1630 అడుగులు, ఇన్ ఫ్లో 1,66,622 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,48,139 క్యూ సెక్కులు, ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిల్వ 96 టీఎంసీలుగా కొనసాగుతుంది.

  • 17 Jul 2022 08:09 AM (IST)

    రోడ్డు మార్గంలో భద్రాచలానికి సీఎం కేసీఆర్‌

    రోడ్డు మార్గంలో భద్రాచలానికి సీఎం కేసీఆర్‌ బయలుదేరారు. వాతావరణం సహరించకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్తున్న కేసీఆర్. భద్రాచలంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షం. ఉదయం 9.45కు ఏటూరు నాగారం చేరుకోనున్న సీఎం కేసీఆర్‌.అధికారులతో వరదలపై సీఎం కేసీఆర్‌ సమీక్షించనున్నారు.

  • 17 Jul 2022 08:02 AM (IST)

    ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

    ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ధవళేశ్వరం దగ్గర 21.7 అడుగులకు నీటిమట్టం చేరింది. కోనసీమ జిల్లాలో వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక.

  • 17 Jul 2022 08:00 AM (IST)

    భద్రాచలం వద్ద శాంతించిన గోదావరి

    భద్రాచలం దగ్గర క్రమంగా గోదావరి వరద ఉధృతి తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 65.1 అడుగులకు చేరిన నీటిమట్టం. నిన్నటి నుంచి గోదావరి నీటిమట్టం ఆరు అడుగులు తగ్గింది

  • 17 Jul 2022 07:59 AM (IST)

    ప్రమాదపు అంచున యలమంచిలి మండలం

    పశ్చిమ గోదావరి జిల్లాలో యలమంచిలి మండలంలో గోదావరి పరివాహక గ్రామాలు ప్రమాదగురయ్యే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. గోదావరి గట్టు పై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో.. దొడ్డిపట్ల, వాకలగరువు గ్రామాల్లో వరదకు ఇసుక బస్తాలు వేసి అడ్డుకట్టను వరద నీరు రాకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో గ్రామస్థులు ఆందోళనలో చెందుతున్నారు.

  • 17 Jul 2022 07:55 AM (IST)

    జూరాల ప్రాజెక్టు కొనసాగుతున్న వరద

    మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు వరద నీరు చేరడంతో.. 23 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదలన చేసారు అధికారులు. ఇన్ ఫ్లో : 1,50,000 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 1,53,861 క్యూసెక్కులు వుంది. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 పీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం :1042 పీట్లు వుంది. పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ: 7.571 టీఎంసీలుగా వుంది. 12 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల చేసిన అధికారులు.

  • 17 Jul 2022 07:28 AM (IST)

    భద్రాద్రిలో నేడు గవర్నర్​ తమిళిసై పర్యటన

    గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. వరద పరిస్థితులను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించనున్నారు. నిన్న రాత్రి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో కొత్తగూడెంకు బయల్దేరారు. అక్కడి నుంచి భద్రాచలం వెళ్తారు. గోదావరి వరద కారణంగా జిల్లాలో ఉత్పన్నమైన పరిస్థితులను పరిశీలించడంతో పాటు వరద బాధితులతో గవర్నర్‌ మాట్లాడనున్నారు.

  • 17 Jul 2022 07:26 AM (IST)

    నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ సర్వే

    గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు, రేపు ఏరియల్‌ సర్వే నిర్వహించి, వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేసి.. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఉదయం 07.45 గంటలకు వరంగల్ నుంచి రోడ్డు మార్గంద్వారా భద్రాచలం పయనమయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. 09.30 గంటలకు భద్రాచలంలో జిల్లా అధికారులతో సమీక్ష, 09.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా ఏటూరునాగారం వరద ప్రభావిత ప్రాంతాల సందర్శించనున్నారు. 11.00 గంటలకు ఏటూరునాగారం ఐటీడీ ఏలో అధికారులతో సమావేశం నిర్వహించి, 11.45 గంటలకు ఏటూరునాగారం నుంచి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ కు తిరిగి పయనమవుతారు.

  • 16 Jul 2022 09:28 PM (IST)

    ధవళేశ్వరం బ్యారేజ్ అప్ డేట్

    శనివారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి వరద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 25.48 లక్షల క్యూసెక్కులుగా వుంది. వరద సహాయక చర్యల్లో మొత్తం 10 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిమగ్నం అయి వున్నాయి. ఈసహాయక చర్యల వివరాలను విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. వరద ఉధృతి దృష్ట్యా అదనపు సహాయక బృందాలు పంపామని చెప్పారు. ఆరు జిల్లాల్లోని 62 మండలాల్లో 324 గ్రామాలు వరద ప్రభావితమైనవని , మరో 191 గ్రామల్లో వరద చేరిందని తెలిపారు. ఇప్పటివరకు 76,775 మందిని ఖాళీ చేయించినట్లు 71,200 మందిని 177 పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. 243 మెడికల్ క్యాంప్స్ నిర్వహించినట్లు చెప్పారు. 54,823 ఆహార ప్యాకేట్లు పంచినట్లు వివరించారు.

  • 16 Jul 2022 08:10 PM (IST)

    సుంకేసులకు పెరిగిన వరద

    సుంకేసుల ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం

    * ఇన్ ఫ్లో 1,62,493 క్యూసెక్కులు

    * అవుట్ ఫ్లో 1,61,988 క్యూసెక్కులు

    * 27 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల

    * డ్యాం పూర్తి సామర్థ్యం : 1.2 టిఎంసి

    * ప్రస్తుతం : 0.438 టీఎంసీలు

  • 16 Jul 2022 07:41 PM (IST)

    తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

    తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

    30 గేట్ల ద్వారా నీరు విడుదల

    పూర్తి స్థాయి నీటి మట్టం:1633

    ప్రస్తుతం నీటి మట్టం:1630

    ఇన్ ఫ్లో 1,63,469 క్యూసెక్కులు....

    అవుట్ ఫ్లో 1,49,784క్యూ సెక్కులు

    పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు

    ప్రస్తుతం నీటి నిల్వ 95.086 టీఎంసీలు

  • 16 Jul 2022 07:31 PM (IST)

    భద్రాద్రి మాఢవీధుల్లోకి వరద నీరు

    భద్రాచలం వద్ద గోదావరి కొంతమేరకు శాంతించినప్పటికీ ఇంకా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది. ఎగువ నుంచి వరద తీవ్రత అదే విధంగా కొనసాగుతుంది. స్వల్పంగా గోదావరి తగ్గుముఖం పడుతుంది. ఈ తెల్లవారుజామున నుంచి ఇప్పటివరకు మూడు అడుగుల మేరకు గోదావరి తగ్గింది. అయినప్పటికీ గోదావరి నుంచి స్లూయిజ్‌ లీకేజీ ద్వారా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు కాలనీలోకి మాడవీధుల్లోకి నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లతో ఇప్పటికే సగభాగం మాఢవీధులు నిండిపోయాయి. అన్నదాన సత్రం సగభాగం మునిగిపోయింది. దీంతో సత్రానికి తాళం వేశారు. అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం మెట్ల మార్గం పూర్తిగా మూసుకుని పోయింది. దీనికి తోడు టెంపుల్ చుట్టుపక్కల ఉండే ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని రెండు రోజుల నుంచి ఇళ్ళు, లాడ్జిలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు . అదేవిధంగా కరెంటును కూడా తీసివేశారు. అయితే స్లూయిజ్ మోటార్లు చెడిపోవడంతో లీకేజీ పెరిగి నీళ్లు ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి పునరావాస శిబిరాలకి బంధువుల ఇండ్లలోకి వెళ్లిపోయారు. తమ ప్రాంతం నుంచి సామాగ్రిని తరలించుకోవాలంటే పడవలు ఒకటే మార్గంగా తయారయ్యాయి.

  • 16 Jul 2022 06:35 PM (IST)

    నడిగాడి లంక వాసుల ఆందోళన

    కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం నడిగాడి లంక గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. తామంతా వరద ముంపులో చిక్కుకున్నా ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా వరదలు ఇళ్ళను ముంచెత్తితే కనీసం మా వైపు ఎవరూ కన్నెత్తి చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 16 Jul 2022 05:29 PM (IST)

    వరదల వల్ల ప్రాథమిక నష్టం ఎంతంటే..?

    గోదావరి వరద వల్ల ప్రాథమిక నష్టం అంచనా వేసింది ఏపీ ప్రభుత్వం. వరద ప్రభావిత ఆరు జిల్లాల్లో ఇప్పటి వరకు 7842 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. ఆరు జిల్లాల్లో మొత్తంగా హర్టికల్చర్‌కు సంబంధించి 14650 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. 1100 కిలో మీటర్ల మేర దెబ్బతిన్న రహదారులు. భారీ ఎత్తున వరద రావడంతో నష్టం కూడా భారీగానే ఉండొచ్చని ఆందోళన.ఎల్లుండి నుంచి నష్టం అంచనా పనులను ముమ్మరంగా చేపట్టనున్న అధికారులు.భారీ ఎత్తున నష్టం సంభవిస్తే కేంద్ర సాయం అర్ధించనుంది ప్రభుత్వం.

  • 16 Jul 2022 05:16 PM (IST)

    21, 22 తేదీల్లో వరద ప్రాంతాల్లో బాబు టూర్

    భారీవర్షాలు, గోదావరి వరదలతో ఏపీలో పరిస్థితి దయనీయంగా మారింది. వరదలతో లంక గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు చంద్రబాబునాయుడు . ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏర్పాట్లు చేశారు. గాల్లో తిరిగితే సీఎం జగనుకు ప్రజల వరద కష్టాలు ఏం తెలుస్తాయి. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే కాలికి బురద అంటకుండా హెలికాప్టరులో సీఎం జగన్ తిరుగుతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

  • 16 Jul 2022 03:33 PM (IST)

    తగ్గని వరద

    కుక్కునూరుకు అదనపు బలగాలు వస్తున్నాయి. భద్రాచలం దగ్గర ఇన్ ఫ్లో తగ్గినా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో వరద తగ్గటానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం వుందంటున్నారు అధికారులు. దీంతో రంగంలోకి వచ్చిన అదనపు రెస్క్యూ బృందాలు అటువైపు వెళుతున్నాయి. కుక్కునూరుకు 40 మంది అదనపు రెస్క్యూ టీం చేరుకుంది.

  • 16 Jul 2022 03:31 PM (IST)

    గోదారిలా మారిన రహదారులు

    ఏలూరు జిల్లాలో భారీవర్షాలు, వరదలతో ఇళ్ళు, పొలాలు ఏకం అయిపోయాయి. గోదావరిలా మారిన రహదారులు. మూడు వంతులు నీట మునిగిన కరెంట్ స్తంభాలు. వందలాది మందిని బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న ఫైర్ సేఫ్టీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. ముందస్తుగా ఇళ్లు వదిలి రావటానికి మొరాయిస్తున్న పలువురు గ్రామస్తులను బుజ్జగిస్తున్న రెస్య్యూ టీంలు. ఒప్పించి ఉదయం తీసుకుని వస్తే సాయంత్రం నాటు పడవల్లో తిరిగి ఇళ్ళకు వెళ్ళి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు.

  • 16 Jul 2022 01:56 PM (IST)

    వరద బాధితులను పరామర్శించనున్న కేసీఆర్‌..

    గోదావరి పరివాహక ప్రాంతాలను ఇంకా వరద నీరు వీడడం లేదు.. అయితే, రేపు వరద బాధితుల్ని పరామర్శించనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏరియల్ సర్వే నిర్వహించనున్న ఆయన.. ఆ తర్వాత ముంపు ప్రాంతాలకు కూడా వెళ్లనున్నారని చెబుతున్నారు.. ప్రజలను స్వయంగా కలిసి వారి కష్టాలను తెలుసుకోనున్నారు కేసీఆర్.. ఇక, వరద బాధితులకు సహాయం కూడా ప్రకటించనున్నారని తెలుస్తోంది.

  • 16 Jul 2022 01:09 PM (IST)

    శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

    * శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

    * ఇన్ ఫ్లో : 3,18,833 క్యూసెక్కులు

    * ఔట్ ఫ్లో : 31,784 క్యూసెక్కులు

    * పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

    * ప్రస్తుతం : 851.10 అడుగులు

    * పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

    * ప్రస్తుతం : 82.5758 టీఎంసీలు

    * తెలంగాణ విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

  • 16 Jul 2022 01:04 PM (IST)

    భూపాలపల్లి జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటన

    నేడు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. మంత్రిని చూడగానే బాధితులంతా వచ్చి కన్నీరు పెట్టుకున్నారు. సర్వం కోల్పోయామని ఆదుకోవాలని విజ్క్షప్తి చేసారు. భూపాలపల్లిలో పలిమెల గ్రామాన్ని గోదావరి వరద ముంచెత్తింది. దీంతో ఆ గ్రామ ప్రజల కోసం మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో పునవారస శిభిరం ఏర్పాటు చేశారు. దీంతో ఈ శిబిరంలో సుమారు నాలుగు వందల పైగా బాధితులు వున్నారు. పునరావాస శిబిరాన్ని సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ ను వరద బాధితులను ఓదార్చారు.

Exit mobile version