Site icon NTV Telugu

LIVE : భద్రాచలం శ్రీ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

Srirama

Srirama

https://www.youtube.com/watch?v=tlb10ojL91g

భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వాముల వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 లకు శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. 11వ తేదీన శ్రీరామచంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. శ్రీసీతారామచంద్ర స్వాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు వేశారు. 2.5లక్షల తలంబ్రాల పాకెట్లు సిధ్దం చేశారు. భద్రాద్రి ఆలయాన్ని రంగురంగుల విద్యుదీపాలతో అలంకరించారు. రేపు జరిగే స్వామి వారి కళ్యాణోత్సవానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ హాజరు కానున్నారు. 11వ తేదీన జరిగే మహా పట్టాభిషేక మహోత్సవంలో గవర్నర్ తమిళ్ సై పాల్గొంటారు. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా భక్తులు లేకుండానే కల్యాణం జరుగుతోంది. ఈసారి భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.

Exit mobile version