Site icon NTV Telugu

Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ను శాసనసభలో తొలుత సమర్పించనున్నారు.సెక్రటేరియేట్ లోని తన ఛాంబరుకు చేరుకున్నారు మంత్రి బుగ్గన. బడ్జెట్ ప్రతులకు పూజ కార్యక్రమం. తొమ్మిది గంటలకు కేబినెట్ ప్రత్యేక భేటీ జరిగింది. 2022-23 వార్షిక బడ్జెట్టుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.

సుమారు రూ. 2.50 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టే ఛాన్స్ వుంది. గత బడ్జెట్ కంటే రూ. 20-25 వేల కోట్ల అదనంగా 2022-23 వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం వుంది. నవరత్నాలు.. సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని భావిస్తున్నారు.సుమారు రూ. 1 లక్ష కోట్ల మేర నవరత్నాలకు కేటాయించే అవకాశం.కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా చెల్లింపులపై బడ్జెట్టులో ఎలాంటి ప్రస్తావన చేస్తారోననే ఉత్కంఠ నెలకొంది. రాబడుల అంచనాలను పెంచి చూపే ఛాన్స్. మహిళలు, పిల్లల సంక్షేమంపై ప్రత్యేక ప్రస్తావన వుండవచ్చు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి రూ. 350 కోట్ల కేటాయించనున్నారు. నియోజకవర్గానికి రూ. 2 కోట్ల కేటాయింపు. తొలిసారిగా నియోజకవర్గ అభివృద్ధి నిధులను బడ్జెట్టులో కేటాయించింది సర్కార్. వ్యవసాయానికి రూ. 31వేల కోట్లు.. వ్యవసాయంలో మౌళిక సదుపాయాల కల్పనకు మరో రూ. 10 వేల కోట్ల కేటాయించనున్నారు.

Exit mobile version