Site icon NTV Telugu

LIVE: గాల్లో కాల్పులు. చేయిదాటిన పరిస్థితి

Amalapuram Fire

Amalapuram Fire

LIVE : గాల్లో కాల్పులు...చేయిదాటిపోయిన పరిస్థితి l Amalapuram High Tension l NTV Live

అమలాపురంలో పరిస్థితి చేయిదాటిపోయింది. మంత్రి విశ్వరూప్ ఇంటిని తగలబెట్టారు ఆందోళనకారులు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అమలాపురం చేరుకున్నారు ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు. కోనసీమకు అదనపు బలగాలు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు డీఐజీ పాలరాజు. ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఇల్లు దగ్ధం చేశారు. ఆయన ఇంటికి కూడా నిప్పంటించారు ఆందోళనకారులు. అమలాపురంలో కొనసాగుతున్న ఉద్రిక్తతతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.

రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ని వివాదాల్లోకి లాక్కూడదన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. అమలాపురం దాడుల వెనుక టీడీపీ, జనసేన హస్తం వుంది. ఎందుకీ ప్రాంతాన్ని ప్రశాంతంగా వుంచాలని వారు భావిస్తున్నారు. అందరినీ వేడుకుంటున్నా. మీ అభ్యంతరాలు పరిశీలిస్తాం. ఉద్యమకారులు సంయమనం పాటించాలన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్.

Exit mobile version