Site icon NTV Telugu

Liquor Shops Closed: మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌.. వరుసగా 3 రోజులు మద్యం షాపులు బంద్‌

Liquor Shops

Liquor Shops

Liquor Shops Closed: మందు బాబులకు బ్యాడ్‌ న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం.. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అన్ని రకాల మద్యం షాపులు మూతపడనున్నాయి.. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు.. అంటే, ఈ నెల 11, 12, 13 తేదీల్లో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13వ తేదీన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. ఈ ఎన్నికల నేపథ్యంలోనే.. ప్రలోభాలకు తావివ్వకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు..

Read Also: TSRTC: ప్రయాణికులకు బంపర్‌ ఆఫర్.. రేపటి నుంచి కొత్తగా టీ 6 , ఎఫ్ 24 టికెట్లు

ఈ నెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ జరగనుండగా.. 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.. ఇక, 16వ తేదీ కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాల్లోనూ లిక్కర్‌ షాపులు క్లోజ్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ సర్కార్. మరోవైపు.. మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు (స్టార్‌ హోటళ్లలో సైతం), టూరిజం బార్స్, నేవల్‌ క్యాంటీన్స్, కల్లు దుకాణాలు, మద్యం డిపోలు కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన సెలవుగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కాగా, వరుసగా మూడు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయనుండడంతో.. మందు బాబులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేస్తోంది.

Exit mobile version