కొన్ని తీపి గుర్తులు.. మరికొన్ని చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి.. కొత్త ఆశలతో, సరికొత్త ఉత్సాహంతో 2022 సంవత్సరానికి ఆహ్వానం పలికారు ప్రజలు.. ఎవ్వరి రేంజ్‌లో వారు డిసెంబర్ 31వ తేదీన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో ఆ జోష్ స్పష్టంగా కనిపించింది.. ఎందుకంటే.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో.. 2021 డిసెంబర్ 31న లిక్కర్ సేల్స్ ఏకంగా రూ.50 కోట్ల మేర పెరిగాయి.. న్యూఇయర్ వేళ.. ఏపీలో మద్యంతో ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు మందుబాబులు.
Read Alsoష: అసెంబ్లీ ఎఫెక్ట్.. 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కోవిడ్
రాష్ట్రంలో ఒక్క రోజులో రూ. 124.10 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ గణాంకాలు చెబుతున్నాయి.. మొత్తంగా 1.36 లక్షల ఐఎంఎల్ లిక్కర్ సేల్స్ జరగగా.. 53 వేలకు పైగా బీర్ కేసులు తాగేశారు.. సాధారణంగా రోజువారీ రూ. 70-75 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి.. కానీ, కొత్త సంవత్సరం వేడుకల సందర్బంగా సుమారు రూ. 50 కోట్ల మేర అదనంగా మద్యం అమ్మకాలు జరిగాయి.. దీనికి.. ఏపీలో మద్యం ధరలు తగ్గడం ఒక్కటైతే.. దానికి న్యూ ఇయర్ తోడు కావడంతో సేల్స్ అమాంతం పెరిగిపోయాయి.. అయితే, కొత్త సంవత్సర వేడుకలకు లిక్కర్ సేల్స్ అధికంగా ఉంటుందని.. మద్యం దుకాణాలకు ముందుగానే ఎక్కువగా సరఫరా చేశాయి.. 30వ తేదీనే రూ. 121 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేయగా.. 30, 31వ తేదీల్లో రూ. 215 కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేసింది ఎక్సైజ్ శాఖ.. కానీ, సరఫరా చేసిన మొత్తం మద్యాన్ని ఖాళీ చేశారు మందుబాబులు.. మొత్తంగా న్యూ ఇయర్ జోష్.. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించింది.