NTV Telugu Site icon

AP Liquor Rates Hike: మందుబాబులకు బిగ్ షాక్.. ఏపీలో పెరిగిన మద్యం ధరలు..

Ap Liwour

Ap Liwour

AP Liquor Rates Hike: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధరలను ప్రభుత్వం సవరించింది. ఈ సందర్భంగా, 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడు కేటగిరీలుగా మద్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఇండియన్ మేడ్, ఫారిన్ లిక్కర్, బీర్లుగా సరఫరా అవుతుంది. అయితే, ఇటీవల మద్యం అమ్మకాలపై దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన చేయడంతో కమిషన్‌ 14.5 నుంచి 20 శాతం పెంపుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో అన్ని కేటగిరీల్లో 15 శాతం ధరలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ఎక్సైజ్ శాఖ.

Read Also: BYD Sealion- 7 Electric SUV: ఫిబ్రవరి 17న మార్కెట్లోకి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కి.మీ రేంజ్

అయితే, గత ప్రభుత్వం 2019-24 కాలంలో అమలు చేసిన ఎక్సైజ్ విధానాలను ఎన్డీయే కూటమి సర్కార్ సమీక్షించింది. అనంతరం, లిక్కర్ విధానాలకు సంబంధించి వే ఫార్వర్డ్‌ను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇందులో, రిటైల్ వాణిజ్యం, మద్యం ధరలు, పన్నులపై కొత్త ఎక్సైజ్ పాలసీ ముసాయిదా కోసం కేబినెట్ సబ్-కమిటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక, ఈ కేబినెట్ సబ్- కమిటీ తన సిఫార్సులను కేబినెట్ కు సమర్పించింది. ఆ తర్వాత రిటైలింగ్, ప్రైసింగ్, పన్నులపై కొత్త ఎక్సైజ్ విధానాన్ని ఆమోదించడంతో తాజాగా, మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.