NTV Telugu Site icon

AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Ap Telangana Rains

Ap Telangana Rains

AP-Telangana: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోని కొన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రానున్నాయని, రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని.. సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు.

Read also: Astrology: ఆగస్టు 26, శనివారం దినఫలాలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు..
రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు దిగువ ట్రోపో ప్రాంతంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో ఈరోజు ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల, ఆదివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?