Site icon NTV Telugu

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ..ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు

ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టూరులో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఏర్పాటు చేశారు. సంతమాగులూరు మండలం వెల్లలచెరువలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. సింగరాయకొండలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పాల్గొన్నారు.

Read Also:నార్సింగ్ పోలీస్‌స్టేషన్‌లో.. కరోనా బారినపడ్డ పోలీసులు

కంభం మండంల ఎల్‌కోటలోమాజీ ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మార్కాపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి.కందుకూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్. నేతలు తమ అభిమాన నాయకుడి పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు పేదలకు ఉపయోగపడే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ నివాళులర్పించారు.

Exit mobile version