Nadu-Nedu: నాడు నేడు పథకానికి లారస్ ల్సాబ్స్ భారీ విరాళం అందజేసింది.. లారస్ ల్యాబ్స్ లిమిటెడ్, ప్రముఖ పరిశోధన ఆధారిత ఫార్మాస్యూటికల్ తయారీ మరియు బయోటెక్ కంపెనీ లారస్ ల్యాబ్స్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘నాడు – నేడు‘ కార్యక్రమం కింద రూ. 4 కోట్ల విరాళం అందజేసింది.. దీంతోపాటు పారిశ్రామిక ప్రాంతం అయిన అనకాపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక అధునాతనమైన మరియు అన్ని అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాలిన గాయాలకు సంబంధించి ఒక ప్రత్యేక వార్డు నిర్మాణానికి కూడా 5 కోట్ల రూపాయలు అందిస్తామని కంపెనీ వ్యవస్థాపకుడు మరియు సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో తెలిపారు.
Read Also: Minister Kakani Govardhan Reddy: బాబు, పవన్ భేటీని పట్టించుకోవాల్సిన పనిలేదు
ఇవాళ తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి.. రాష్ట్రంలో విద్యా మౌలిక సదుపాయాలను పెంపొందించే ముఖ్యమంత్రి ఫ్లాగ్‌షిప్ కార్యక్రమానికి గాను రూ. 4 కోట్ల రూపాయల విరాళ పత్రాలను అందజేశారు. నాడు – నేడు పథకం క్రింద లారస్ ల్యాబ్స్ ఈ విరాళాన్ని అందించడం ఇది మూడోసారి కావడం విశేషం.. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ‘నాడు-నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. ఇప్పటికే ఎన్నో పాఠశాలల రూపం మారిపోగా.. మౌలిక సదుపాయల కల్పనపై కూడా ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మరికొన్ని పాఠశాలలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
