ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు, డాక్టర్లు తీరుపై వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి పనితీరుపై వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సమీక్ష జరిపారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను ఆకస్మిక తనిఖీ చేసిన కృష్ణబాబు డాక్టర్ల హాజరు, బయోమెట్రిక్ పనితీరు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాలపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిజిహెచ్ లో డాక్టర్ల హాజరు తక్కువ ఉండటం, పారిశుద్ధ్య కార్మికుల హాజరు తక్కువ ఉండటం, హాస్పిటల్ ఏడి, ఏఓ పనితీరుపై ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అసహనం వ్యక్తం చేశారు.
Read Also:Boycott Liger: అన్‌స్టాపబుల్ లైగర్‌తో రౌడీ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్
ఆసుపత్రిలో సరిగ్గా పనిచేయని డాక్టర్లు, సిబ్బందిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించారు. చర్యలు తీసుకోవడానికి తనకు అధికారం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేంద్రనాథ్ రెడ్డి సమాధానమివ్వడంతో ఎంతమందికి మెమోలు ఇచ్చారో చెప్పాలన్నారు కృష్ణబాబు. పనితీరు మార్చుకోకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు, సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ఆసుపత్రి అధికారులు అకారణంగా తొలగించిన 107 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందికి న్యాయం చేయాలని కార్మిక సంఘాల నేతలు, జీతాలు పెంచాలని పారిశుధ్య కార్మికులు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు కు వినతి పత్రాలు సమర్పించారు.
Read Also: Kerala Savari: కేరళ ప్రభుత్వ వినూత్న నిర్ణయం.. సొంతగా క్యాబ్ సర్వీస్ ప్రారంభం