NTV Telugu Site icon

కర్నూలు జిల్లాలో రేపు, ఎల్లుండి కేఆర్ఎంబీ బృందం పర్యటన

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బృందం సోమ, మంగళవారాల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. కృష్ణా నది ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో కేఆర్ఎంబీ బృందం సభ్యులు రెండు రోజుల పాటు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మొత్తం కేఆర్ఎంబీ టీమ్‌లో 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన జెన్ కో అధికారులు ఉన్నారు.

Read Also: వైరల్ పిక్: చీర కట్టులో వానరం వయ్యారం

ఈ సందర్భంగా సోమవారం నాడు మల్యాల, ముచ్చుమర్రి, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించనున్నారు. అనంతరం సోమవారం రాత్రికి కేఆర్ఎంబీ సభ్యులు శ్రీశైలంలో బస చేస్తారు. మంగళవారం నాడు శ్రీశైలం ప్రాజెక్టు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వారు పరిశీలిస్తారు.