Site icon NTV Telugu

Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై మంత్రి టీజీ భరత్‌ సంచలన వ్యాఖ్యలు..

Tg Bharath

Tg Bharath

Minister TG Bharat: కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై ఎప్పటి నుంచి చర్చ సాగుతూనే ఉంది.. అయితే, కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుపై కొంత క్లారిటీ ఇస్తూ.. మరోవైపు సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్‌.. కర్నూలులోని ABC క్యాంప్ క్వార్టర్స్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్లు టీజీ భరత్ ప్రకటించారు. అయితే, ప్రభుత్వ క్వార్టర్స్‌లో అసాంఘిక కార్యక్రమాలకు తావు ఇవ్వం.. ఇక నుంచి అక్కడ రచ్చ చేసే వారిని ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటుంది. అవసరమైతే కర్రతో సమాధానం చెబుతాం అంటూ హెచ్చరించారు..

Read Also: Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రభుత్వ క్వార్టర్స్‌లో అనైతిక కార్యకలాపాలు సహించబోమని పేర్కొన్నారు మంత్రి టీజీ భరత్‌.. ప్రభుత్వ ఆస్తులపై రచ్చ చేస్తే కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.. అడ్డుపడితే కఠినా వ్యవహరిస్తాం అన్నారు.. మెడికల్ కళాశాల మసీదు వద్ద రోడ్డు పనులను ప్రారంభించిన మంత్రి టీజీ భరత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్నూలు నగరంలో రోడ్డు విస్తరణ ఇంకా చాల చోట్ల అవసరం ఉందన్నారు.. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు చేపడతామని పేర్కొన్నారు.. కర్నూలు అభివృద్ధిపై వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు మంత్రి టీజీ భరత్‌..

Exit mobile version