Site icon NTV Telugu

Kurnool Bus Fire Incident: కర్నూలు జీజీహెచ్‌లోనే 19 మృతదేహాలు.. బంధువులకు అప్పగింత మరింత ఆలస్యం..!

Kurnool Bus Fire Incident

Kurnool Bus Fire Incident

Kurnool Bus Fire Incident: కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. అయితే ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న వాళ్లు నిద్రలోనే సజీవదహనం అయ్యారు.. దీంతో, ఏది ఎవరి మృతదేహం అని గుర్తించడమే సవాల్ గా మారిపోయింది.. మాంసపు ముద్దలుగా మారిపోవడంతో.. మృతదేహాలను గుర్తించే పనిలో పడిపోయారు వైద్యులు.. కర్నూలు జీజీహెచ్ పోస్టుమార్టం రూమ్‌లోనే ఉన్నాయి 19 మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు.. 19 మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్‌ సేకరించారు.. ఇప్పటికే 11 మృతదేహాలకు సంబంధించిన బంధువుల డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు.. డీఎన్‌ఏ శాంపిల్స్‌ను మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు.. ఇవాళ మరికొన్ని మృతదేహలకు సంబంధించి బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్‌ సేకరించనున్నారు.. అయితే, ఈ ప్రాసెస్‌ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో.. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు..

Read Also: Arjun Chakravarthy : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’..ఎక్కడ చూడాలంటే ?

Exit mobile version