NTV Telugu Site icon

Deputy CM Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ భుజం ఎక్కిన బుడ్డోడు.. వాడి సంతోషం చూడండి..!

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కనిపిస్తే చాలు.. మా వైపు చూసి చేతులు ఊపితే చాలు.. ఒక్క ఫోటో దిగే అవకాశం ఇస్తే చాలు.. ఒక్క నవ్వు నవ్వితే చాలు.. ఇలా పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ అభిమానులు ఎన్నో కలలు కంటారు.. అయితే, ఓ చిన్నోడికి మాత్రం.. ఏకంగా పవన్‌ కల్యాణ్‌ భుజనాలను ఎక్కే అవకాశం దక్కింది.. పవన్‌ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న పవన్‌ కల్యాణ్.. ఆ సభలో ఓ పిల్లాడు.. ఎర్ర టవల్‌ తలకు కట్టుకుని కనిపించాడు.. దీంతో, ఆ బుడ్డోడిని స్టేజిపైకి రప్పించిన పవన్‌.. అతనని భుజంపై కూర్చోబెట్టుకుని ముద్దాడు.. ఇక, చిన్నోడి చెవిలో ఏదో అడగడం.. అతడు బదులు ఇవ్వడం.. పవన్‌ కల్యాణ్‌ భుజనాలపై ఉన్న సమయంలో.. ఆ బుడ్డోడి సంతోషం అంతా ఇంత కాదని చెప్పాలి.. ఈ ఆ వీడియోను సోషల్‌ మీడియాలో వదిలారు జనసేన శ్రేణులు.. దీంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది.. ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేసి.. మీరు కూడా ఓ లుక్ వేయండి..

కాగా, కర్నూలు జిల్లా పర్యటనలో పూడిచెర్ల వద్ద నీటిగుంట పనులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షా 55 వేల నీటి కుంటలు మే ఆఖరులోగా లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం.. రాయలసీమ రతనాల సీమ కావాలి.. అభివృద్ధి కొందరికే కాకుండా అందరికి కావాలని తెలిపారు. ఒకే రోజు 13,320 గ్రామ సభలు నిర్వహించాం.. అభివృద్ధిలో చంద్రబాబు నాయకత్వంలో ముందడుగు వేస్తున్నాం.. 16 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించాం.. ఇజ్రాయెల్ ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది.. నీటి కుంటలు సద్వినియోగం చేసుకుంటే పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు వినియోగించుకోవాలి.. నా ఫారంలో నీతికుంటలు తవ్వుకున్నాను.. పాలేకర్ వ్యవసాయ విధానం అనుసరించాలి.. ఓజిలో హీరోలా కాకుండా సగటు రైతులా మాట్లాడుతున్నారు.. ఉపాధి దొరక్కపోతే, సినిమాల్లో ఛాన్స్ ఇవ్వకుంటే నేను నర్సరీలో పని చేయాలనుకున్నాను అని పవన్‌ కల్యాణ్ పేర్కొన్న విషయం విదితమే..