Kurnool Bus Incident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు సజీవదహనం అయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. అయితే, కర్నూలు ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే, లక్ష్మయ్య నకిలీ సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందినట్టు గుర్తించారు పోలీసులు.. 5వ తరగతి వరకే చదువుకుని, నకిలీ 10వ తరగతి సర్టిఫికెట్లతో హెవీ లైసెన్స్ పొందాడట లక్ష్మయ్య.. ఇక, ఆయన స్వస్థలం పల్నాడు జిల్లా ఒప్పిచర్లగా గుర్తించారు.. నకిలీ సర్టిఫికెట్లతో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన లక్ష్మయ్య. కావేరీ ట్రావెల్స్‌లో చేరి.. ప్రమాదానికి గురైన బస్సును నడిపాడు.. కాగా, కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌తో పాటు 19 మంది ప్రయాణికులు మృతిచెందారు.. కర్నూలు జీజీహెచ్ పోస్టుమార్టం రూమ్‌లోనే ఉన్నాయి 19 మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు.. 19 మృతదేహాల డీఎన్ఏ శాంపిల్స్ సేకరించారు.. ఇప్పటికే 11 మృతదేహాలకు సంబంధించిన బంధువుల డీఎన్ఏ శాంపిల్స్‌ను కూడా సేకరించారు ఫోరెన్సిక్ అధికారులు.. డీఎన్‌ఏ శాంపిల్స్‌ను మంగళగిరి ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు.. ఇవాళ మరికొన్ని మృతదేహలకు సంబంధించి బంధువుల నుంచి డీఎన్ఏ శాంపిల్స్ సేకరించనున్నారు.. అయితే, ఈ ప్రాసెస్ మొత్తం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో.. మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
Read Also: Man Attacked by Old Women:ఎవడ్రా నువ్వు.. వృద్ధురాలిపై దాడి చేసిన సర్పంచ్ భర్త..
