Site icon NTV Telugu

Buggana Rajendranath: మీకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా?.. కోట్ల, కె.యి లపై ఫైర్

Buggana

Buggana

Buggana Rajendranath: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి డోన్ బహిరంగ సభలో కోట్ల, కె.యి.లపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నారు.. మీకు నిజంగా అభివృద్ధి అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. మీ దృష్టిలో కేఈ కోట్ల కలవడమే అభివృద్ధా అని మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి చూడాలంటే వారం రోజులు పడుతుందని చెప్పారు. 2014లో తాను రూ.50 లక్షలతో స్కూలు భవనాన్ని కట్టాలనుకుంటే ఇద్దరు కేకేలు అనుమతులు రాకుండా ఆపారని ఆరోపించారు. ఇక్కడ ప్రతి పనికి కప్పం వసూలు చేసిన జ్ఞాపకాలు డోన్ ప్రజలు మరువలేదని విమర్శించారు.

Mamata Banerjee: కోల్‌కతా హైకోర్టు తీర్పుపై సీఎం సంచలన వ్యాఖ్యలు.. సవాల్ చేస్తామని ప్రకటన

రైల్వే మంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన పని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. నేడు కే.ఈ, కోట్ల అధికారం కోసం కాకుండా నాడు ప్రజల కోసం కలిసి ఉంటే 100 మందికి పైగా మహిళలు భర్తలను కోల్పోయేవారు కాదన్నారు. తమ పార్టీ కార్యకర్తలని చంపిన, తన నాన్నను ఓడించిన పార్టీలోకి చేరి పచ్చ కండువా ఎలా కప్పుకున్నారని అడిగారు. డోన్ ఫ్లైఓవర్ పొడవు ఎందుకు పెరిగిందో ప్రజలందరికీ తెలుసని.. 40 సంవత్సరాల అనుభవంలో గాంధీ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించలేకపోయారని దుయ్యబట్టారు బుగ్గన.

Thalaivar 171: టైటిల్ చెప్పేశారు.. ఫాన్స్ గెట్ రెడీ!

Exit mobile version