Site icon NTV Telugu

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌ వీడియో వైరల్..

Biker Shiv Shankar

Biker Shiv Shankar

Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఘటనలో బైకర్‌ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. బైక్‌ను బస్సు ఢీకొనడం.. కొంత దూరం అలాగే లాక్కెళ్లడంతో.. బైక్‌లో మంటలు.. ఆ తర్వాత బస్సులో మంటలు చెలరేగడంతోనే ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. ఇప్పటికే ప్రమాదానికి గురైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను అరెస్ట్ చేశారు.. ఫేక్‌ సర్టిఫికెట్లతో హెవీ వెహికల్ లైసెన్స్ పొందినట్టు గుర్తించారు.. మరోవైపు.. ఇప్పుడు బైకర్‌ శివశంకర్ వీడియో వైరల్‌ అవుతోంది..

Read Also: Teacher Attacked School Boy: పిల్లల మధ్య వివాదం.. మధ్యలో దూరిన టీచర్ ఏం చేశాడో తెలుసా..

ఈ ప్రమాదానికి ముందు స్థానికంగా ఉన్న పెట్రోల్‌ బంక్‌లోకి బైక్‌పై శివశంకర్‌ వెళ్లిన వీడియో వైరల్‌గా మారింది.. పెట్రోల్‌ కొట్టించుకునేందుకు పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు శివశంకర్‌.. అతడితోపాటు మరో యువకుడు బైక్‌ వెనకాల ఉన్నాడు.. అయితే, తిరిగి పెట్రోల్ బంక్‌ నుంచి వెళ్లిపోతున్న సమయంలో మాత్రం శివశంకర్‌ ఒకడే బైక్‌పై ఉన్నాడు. అంతేకాదు. ఆ సమయంలో శివశంకర్‌ మద్యం మత్తులో ఉన్నట్లుగా దృశ్యాలను చూస్తే అర్థమవుతోంది.. పెట్రోల్ బంక్‌ నుంచి బైక్‌పై వెళ్తోన్న సమయంలో.. బైక్‌పై ఉన్న శివశంకర్‌ తూలినట్టు.. ఆ బైక్‌ కూడా స్కిడ్‌ అయినట్టు కనిపిస్తోంది.. ఆ తర్వాత బైక్ హైవే మీదకు రావడం.. ఆ తర్వాత ప్రమాదానికి కారణమైనట్టుగా భావిస్తున్నారు.. ఈ ప్రమాదంలో బస్సులో 19 మంది సజీవదహనం కాగా.. శివశంకర్‌ కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే..

Exit mobile version