Site icon NTV Telugu

Bhupathiraju Srinivasa Varma: త్యాగానికి చిహ్నం కర్నూలు.. ఇది ఒక నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని..

Bhupathiraju Srinivasa Varm

Bhupathiraju Srinivasa Varm

Bhupathiraju Srinivasa Varma: త్యాగానికి చిహ్నం కర్నూలు.. కర్నూలు ఒక నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని అని గుర్తు చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన సందర్భంగా కర్నూలు శిశారులో ‘సూపర్‌ జీఎస్టీ – సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కర్నూలు నగరం మాత్రమే కాదు.. ఒకప్పటి రాజధాని.. త్యాగానికి చిహ్నం కర్నూలు అన్నారు.. జీఎస్టీ సంస్కరణలపై ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకున్నారన్న ఆయన.. 4 స్లాబుల నుంచి 2 స్లాబులకు పరిమితం చేశారు.. అప్పుల్లో వున్నా.. ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలు అమలు చేసిందన్నారు..

Read Also: Adluri Laxman : మీరు బహిరంగ చర్చకు సిద్ధమా.. మంత్రి అడ్లూరి సవాల్‌

ఆంధ్రప్రదేశ్‌లో 10 నెలల్లో వేల కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.. లక్షల కోట్ల నిధులు ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీకి కేటాయించారని తెలిపారు శ్రీనివాస వర్మ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారత్ ను నిలబెట్టారు.. భారతీయులు గర్వపడేలా భారత్ లో పాలన సాగుతోంది.. ఏపీని సెమీ కండక్టర్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నారు అని తెలిపారు.. ఇక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో ఏపీ.. సూపర్ ఆంధ్రప్రదేశ్ గా తయారవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సూపర్ సక్సెస్ సభను కర్నూలులో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ..

Exit mobile version