NTV Telugu Site icon

AP High Court: కర్నూల్‌లో హైకోర్టు బెంచ్.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Ap High Court

Ap High Court

AP High Court: కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన సవాలు చేస్తూ దాఖలైన పిల్ పై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. 28-10-2024 లా సెక్రటరీ హైకోర్టుకి పంపిన లేఖ నిబంధనలకు విరుద్ధమన్నారు పిటిషనర్ న్యాయవాది యోగేష్.. అయితే, బెంచ్ ఏర్పాటుపై తమదే తుది నిర్ణయమని న్యాయస్థానం పేర్కొంది.. ఆ లేఖ తమపై ప్రభావం చూపదన్న న్యాయస్థానం.. స్వతంత్రంగా మేం నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది.. వేర్వేరు రాష్ట్రాల నుంచి బెంచ్ ల ఏర్పాటు మీద వివరాలు తెప్పించుకున్నట్టు వ్యాఖ్యానించింది.. ఏపీలో బెంచ్ ఏర్పాటు అవసరం ఉందా లేదా అనే ఇతర అంశాల డేటాను తెప్పించుకుంటున్నామని న్యాయస్థానం చెప్పింది..

Read Also: Tesla Cars : నిరీక్షణకు తెర.. ఏప్రిల్ నుంచి భారత్ లో పరిగెత్తనున్న టెస్లా కార్లు.. ధర చాలా ఛీప్

అసలు బెంచ్ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు కదా..? అప్పుడే ఎందుకు పిల్ దాఖలు చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు న్యాయమూర్తి.. అసలు లేఖ ఇవ్వటమే న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్టని.. అది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు పిటిషనర్.. లేఖ సారాంశం బెంచ్ అవసరం ఇప్పటికే ఉందని, బెంచ్ ఏర్పాటుకి తీసుకున్నట్టు, బెంచ్‌ని కర్నూల్ లో ఏర్పాటు చేస్తున్నట్టు ఉందని.. ఇదంతా న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకున్నట్టే అని పిటిషనర్ పేర్కొన్నారు.. కాబట్టి బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన పై స్టే ఇవ్వాలని కోరారు.. అయితే, మేం నిర్ణయం తీసుకున్న తర్వాత పిల్ అవసరం ఉండవచ్చు.. ఉండక పోవచ్చు.. కాబట్టి విత్ డ్రా చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది హైకోర్టు.. కానీ, మళ్లీ పిల్ ఫైల్ చేయటానికి కొత్త అంశాలు లేవని ఈ పిల్ ను పెండింగ్ లో పెట్టాలని పిటిషనర్‌ కోరగా.. 3 నెలలకి వాయిదా వేసింది హైకోర్టు..