ఆరుగాలం శ్రమించినా ఫలితం శూన్యమంటూ ఓ మిరప రైతు ఆందోళన చెందుతున్నాడు. పచ్చిమిర్చి ధర పూర్తిగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో 10 ఎకరాలు మిరప పంటను ధ్వంసం చేశాడు రైతు షఫీ. మిరప పంటపై 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అయితే.. మూడు కోతలకు 3 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. నాలుగో కోతకు ధర పడిపోయిందని.. దీంతో గిట్టుబాట ధర రాక పంట తొలగించానని రైతు చెబుతున్నాడు.
Read Also: Pawan Kalyan: ఉద్యోగం ఇప్పించండి సార్.. డిప్యూటీ సీఎంకు దివ్యాంగురాలు విజ్ఞప్తి
ప్రతి సంవత్సరం ఉల్లి, మిరప సాగు చేస్తానని.. అయితే గతేడాది ఉల్లికి గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోయాయని.. ఈసారి ఉల్లికి డిమాండ్ ఉందని చెప్పాడు. అలాగే మిరపకు గిట్టుబాట ధర లేకపోవడంతో పంట తీసిన కూలీలకు డబ్బులు చెల్లించగా తనకు మిగిలిందేమీ లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే 10 ఎకరాల మిరప పంటను తొలగించినట్లు రైతు షఫీ చెప్పాడు.
Read Also: Chittoor: వీడిన పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసు మిస్టరీ..