Site icon NTV Telugu

MLA Followers Attack: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుల దౌర్జన్యం

Mob

Mob

కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుడు ఇంతియా బాషా మున్సిపాలిటీ స్థలాన్ని ఆక్రమించి పక్కనే నివాసం ఉన్నవారిపై దాడికి పాల్పడ్డారు. ఇంతి యాజ్ అనే వ్యక్తి 20 మందితో కలిసి తమపై దాడి చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కర్నూలు పాతబస్టాండు అర్బన్ బ్యాంకు ఎదురుగా మున్సిపల్ ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం పక్కనే చింత కృష్ణయ్య కుమారుడు చింత నరసింహయ్య (ఇంటి నంబరు 67/53) కుటుంబం 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. మున్సిపల్ స్థలంలోంచే నరసింహయ్య కుటుంబం రాక పోకలు సాగిస్తోంది.

Read Also:Tirumala Rush: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటల సమయం

అయితే.. ఈ స్థలంపై కన్నేసిన ఇంతియాజ్ దానిని ఆక్రమించి చిన్న గుడిసె నిర్మించారు. పక్కింటివారు ఎవరూ కూడా ఈ దారిలో నడవరాదని ఇంతియాజ్ ఆంక్షలు విధించారు. ఆ ఇంటికి వేరే దారి లేదు. ఈ నేపథ్యంలో బాషా ఆక్రమించుకున్న మున్సిపాలిటీ స్థలాన్ని నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోరుతూ నరసింహయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంతియాజ్ కూడా హైకోర్టుకు వెళ్లి తనకు ఇంజక్షన్ ఆర్డరు ఇవ్వాలని కోరారు. ఇంతి యాజ్ పిటిషన్ను 2017 ఆగస్టు 18న హైకోర్టు కొట్టేసింది.

అంతేగాకుండా గుడిసె నిర్మించిన స్ధలాన్ని స్వాధీనం చేసుకోవాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధిక్కరించిన ఇంతియాజ్ గుడిసెను తొలగించి ఆ స్థలంలో రెండస్తుల భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. దీంతో నరసింహయ్య కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు శశికళ శనివారం పనులు అడ్డుకునే ప్రయ్నతం చేశారు. దీంతో సుమారు 20 మందితో కలిసి ఇంతియాజ్ వీరిపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరకు తాము పోలీస్ స్టేషన్ కు వెళితే తమపై కూడా కేసు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also:Sandhya Convection MD Arrest: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు అరెస్ట్.. కారణం ఇదే..

Exit mobile version