Site icon NTV Telugu

KS Rama Rao : సినిమాలకు ఏపీ ప్రభుత్వ అండగా నిలిచింది

ప్రముఖ సినీ నిర్మాత కెఎస్ రామారావు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆర్‌ఆర్ఆర్‌ సినిమాకు ఎంతో సహకారం అందించారన్నారు. పెద్ద,చిన్న సినిమాలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలులో సినిమాకు సంబంధించిన అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయని, కర్నూలులో సినిమా షూటింగ్, ఫిల్మ్ క్లబ్ ఏర్పాటుకు సినీ పెద్దలు ఆలోచించాలన్నారు. ఉగాది పండుగ తరువాత ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను, సినీ పెద్దలను సంప్రదిస్తామన్నారు. కర్నూలును సినిమా ఇండస్ట్రీ హబ్ గా చేసేందుకు ముందుకు వెళ్తామని, తుంగభద్ర నది, కేసీ కెనాల్, సమ్మర్ స్టోరేజ్, బాలసాయి స్కూల్ అనువైన ప్రాంతాలను గుర్తించామని ఆయన పేర్కొన్నారు. కర్నూలులో 12 ఎకరాల్లో ఫిలిం సిటీగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version