NTV Telugu Site icon

YS Viveka murder case: బెయిల్ పిటిషన్‌.. శుక్రవారానికి వాయిదా

AP High Court

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితులుగా ఉన్న వై. సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే! ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే నిందితుల వాదనలు పూర్తవ్వగా.. ఈరోజు (బుధవారం) సీబీఐ, వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాదులు తమ వాదనల్ని వినిపించారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టుకి సునీత హాజరయ్యారు.

Read Also: Kolkata: చిదంబరానికి నిరసన సెగ.. నువ్వో దలాల్..!

ఇందులో భాగంగా 250 మంది సాక్షుల విచారణ పూర్తయ్యింది. అనంతరం వాదనల్ని ధర్మాసనం శుక్రవారానికి వాయిదా వేసింది. అటు, ఏ5 (దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి) తరఫున వాదనలూ పూర్తయ్యాయి. ప్రాసిక్యూషన్ తరపున వాదనల్ని ఎల్లుండి వింటామన్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ మీద ఉన్న విషయం విదితమే! నిందితుల నుంచి వాంగ్మూలాలు సేకరించారని, వారికి ఎటువంటి ప్రాణహాని లేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందువల్ల నిందుతులకి బెయిల్ ఇవ్వాలని కోర్టుని కోరారు.

ఇదిలావుండగా.. గత సోమవారం శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ప్రారంభం కాగానే, సునీత తరఫు న్యాయవాది తమ వాదనలు కూడా వినాలని అనుబంధ పిటిషన్ దాఖలు చేశామన్నారు. మృతిడి కుమార్తెగా ఆమె ఇంప్లీడ్ అయ్యేందుకు అర్హత ఉందని చెప్పారు. గతంలో శివశంకర్‌రెడ్డి పిటిషన్‌ను ఓ న్యాయమూర్తి కొట్టేశారని, ప్రస్తుత పిటిషన్‌ అక్కడికే విచారణకు వెళ్ళాలని కోర్టు దృష్టికి తెచ్చారు.