MLA Kolikapudi Srinivasa Rao: ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కలకలం రేపుతున్నాయి.. మరోసారి ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయాలు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించారు.. అంతేకాదు, తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఇక, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన 50 లక్షల రూపాయలు.. నా మిత్రులు ఇచ్చిన 3.50 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం.. నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు కొలికపూడి.. అయితే, ఇవాళ తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ సంచలన పోస్టులు పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
కాగా, ఈ మధ్యే విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.. ఎంపీ చిన్ని.. పార్టీ పదవులు అమ్ముకుంటున్నారంటూ ఆరోపించిన ఆయన.. ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారని విమర్శించారు.. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడని.. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని.. ఇప్పుడు ఎంపీ పీఏ మొత్తం దందా నడిపిస్తున్నారంటతూ ఎమ్మెల్యే కొలికపూడి వ్యాఖ్యానించడం పెద్ద రచ్చగా మిరిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు.. తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పర్యటన నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కాకరేపుతున్నాయి..
