NTV Telugu Site icon

Minister Nara Lokesh: 10 నెలల్లో 7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..!

Nara Lokesh

Nara Lokesh

Minister Nara Lokesh: గత 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. 4 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు మంత్రి నారా లోకేష్.. కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను ప్రారంభించారు లోకేష్.. దీంతో, అమరావతిలో తొలి ఆటోమొబైల్‌ ప్లాంట్‌గా నిలిచింది అశోక్‌ లేలాండ్‌.. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్‌, డీజిల్‌ బస్సుల బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్‌.. ఈ ప్లాంట్‌ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.. ఇక, ఈ యూనిట్‌ ద్వారా ఫేజ్‌-1లో 600 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనుండా.. ఫేజ్‌-2లో 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. 2022లో మల్లవల్లి పారిశ్రామిక వాడలో నేను పాదయాత్ర చేశాను.. అప్పుడు అశోక్ లేలాండ్ ఫ్లాంట్ నిర్మాణం నిలిపివేసి ఉంది. 2019-24 మధ్య ఏపీలో అనేక పరిశ్రమలు తరలి వెళ్లాయి.. ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాని పరిస్థితిని ఆనాటి పాలకులు తెచ్చారని ఫైర్‌ అయ్యారు..

Read Also: Kannappa : కన్నప్ప నుంచి మహాదేవ శాస్త్రి గ్లింప్స్ రిలీజ్..

2014-2019లో చేసిన ఒప్పందాలకు గత పాలకులు అర్ధం లేకుండా చేశారన్న లోకేష్.. వారి ధన దాహానికి పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టారు.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పరిశ్రమలు ఏర్పాటు పై దృష్టి పెట్టాం.. అశోక్ లేలాండ్ సంస్థ ముందుకు వచ్చి ఫ్లాంట్ నిర్మాణం చేసింది.. అత్యాధునిక సౌకర్యాలతో వివిధ రకాల బస్సులు తయారు చేస్తున్నారు.. వేలాది మందికి ఈ సంస్థ ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు.. ప్రధాని ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో అశోక్ లేలాండ్ సంస్థ విధానాలను అమలు చేస్తుందన్న ఆయన.. మచిలీపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు త్వరలో రానుందన్నారు.. ఇక, గత పది నెలల్లో ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు ఏపీకి వచ్చాయని.. నాలుగు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు..

Read Also: Hyundai Motor: కార్ల ధరలకు రెక్కలు.. ఏప్రిల్ నుండి హ్యూండాయ్ కార్ల ధరల పెంపు

ఇక, అసెంబ్లీలో యాభై శాతం కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు.. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తగా మంత్రులు అయిన వారే ఉన్నారని తెలిపారు మంత్రి నారా లోకేష్.. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు పరిశ్రమలపై మంచి అవగాహన ఉందన్న ఆయన.. మల్లవల్లి పారిశ్రామికవాడలో ఇంకా అనేక పరిశ్రమలు వస్తాయని వెల్లడించారు.. ఇక్కడ ఎమ్మెల్యేగా వెంకట్రావు బాధ్యత తీసుకుంటారు.. అందరితో మాట్లాడతారని తెలిపారు.. అశోక్ లేలాండ్ సంస్థ స్పూర్తితో పారిశ్రామిక వేత్తలు చాలా మంది ఏపీకి వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ మాకు చెబుతుంటారు.. అటువంటి యువత ప్రతిభను మనమే‌ వినియోగించుకునేలా ఇక్కడే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌..