NTV Telugu Site icon

Jogi Ramesh: చంద్రబాబు, పవన్ ఎవరు కలిసి వచ్చినా.. జగన్ ఒక్కరే సమాధానం

Jogi Ramesh

Jogi Ramesh

విజయవాడలోని భవానీపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏలూరులో జనవరి 30న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వైసీపీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాలు పలికామని తెలిపారు. గడచిన ఐదు సంవత్సరాల పాలనపై ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం ఉంటుందని చెప్పారు. కాగా.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా ఏ పార్టీలు కలిసి వచ్చినా సీఎం జగన్ ఒక్కరే వారికి సమాధానం చెబుతారని ఆరోపించారు.

Read Also: Chandrababu: పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు..

మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. గంటా రాజీనామా పై అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని దుయ్యబట్టారు. గంటా న్యాయ పోరాటాన్ని ఎవరు ఆపటం లేదని అన్నారు. కాగా.. ఆయన నాయకత్వం టీడీపీకే అవసరం లేదని విమర్శించారు. గంటా శ్రీనివాసరావుకు టీడీపీలోనే టికెట్ లేక అనవసర ఆరాటాన్ని సృష్టిస్తున్నాడని ఆరోపించారు. నాడు కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసిన షర్మిల.. ఇవాళ అదే కాంగ్రెస్ కి సారథ్యం వహించటంలోనే ఆమె వైఫల్యం తెలుస్తోందని పేర్కొన్నారు.

Read Also: Neru Movie Review: ‘నెరు రివ్యూ’.. లాగిపెట్టి కొట్టాలనిపించేలా ప్రియమణి యాక్టింగ్