NTV Telugu Site icon

2 Fish Cost 4 Lakh: 2 చేపలకు రూ. 4 లక్షలు.. ఎందుకంత డిమాండ్..?

Kachidi Fish

Kachidi Fish

2 Fish Cost 4 Lakh: పులస చేప తింటే అదృష్టమని చెబుతారు. ఎందుకంటే ఇది చాలా అరుదు, చాలా ఖరీదైనది. అందుకే పులస కోసం పుస్తెలయినా సరే తాకట్టు పెట్టొచ్చని అంటారు. పులసలా ఇది కూడా చాలా అరుదుగా మత్స్యకారులచే పట్టబడుతుంది. దీని ధర వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. పెద్ద చేపలతో పాటు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ ఉన్న చేపలు ఉన్నాయి. కొన్ని అరుదైన జాతుల చేపలు వలలో చిక్కితే మత్స్యకారుల పంట పండినట్లే. మీరు రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోతారండోయ్. తాజాగా కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు అరుదైన కచిడి చేపను పట్టుకున్నాడు. కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌లో చేపలను వేలం వేశారు. వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎగబడ్డారు. ఒక వ్యాపారి గరిష్టంగా రూ. 2 లక్షలు చొప్పున రూ. 4 లక్షలకు రెండు చేపలు కొన్నాడు. కచిడి ఫిష్ శాస్త్రీయ నామం ప్రోటోనిబియా డయాకాంతస్. ఈ చేపల కడుపులోని అవయవాలకు ఔషధ గుణాలున్నాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు మత్స్యకారుల వలలో పడడం చాలా అరుదు. కాచిడీ చేపను సముద్రపు బంగారు చేప అని అంటారు.

Read also: Love Guru: ఎగ్జైటింగ్ ఆఫర్ ను అనౌన్స్ చేసిన “లవ్ గురు” మూవీ టీమ్

చేప పేరు సూచించినట్లుగా, ఇది నిజంగా బంగారం వలె విలువైనది. కచిడీ చేప ఒక చోట స్థిరపడదని.. సముద్రంలో ఒకచోటి నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూనే ఉంటుందన్నారు. ఈ చేపలు చాలా దూరం తిరుగుతుండడం వల్ల మత్స్యకారుల వలల్లో అరుదుగా చిక్కుకుంటాయని చెబుతున్నారు. సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేసే దారాన్ని వీటి నుంచే తయారు చేస్తారన్నారు. చేప పొట్ట నుంచి తయారయ్యే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని చెబుతున్నారు. ఈ చేప పిత్తాశయం మరియు ఊపిరితిత్తుల మందుల తయారీలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అంతేకాదు, కాస్ట్లీ వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచిడీ చేపలను ఉపయోగిస్తారు. వైన్‌ను శుభ్రం చేయడంలో ఈ చేప రెక్కలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులు లక్షలు వెచ్చించి వీటిని కొనుగోలు చేస్తున్నారు.
Dogs Attack: నగరంలో మరో దారుణం.. కుక్కల దాడిలో చిన్నారి మృతి..!