NTV Telugu Site icon

Kodali Nani Reaction: నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు..

Kd Nani

Kd Nani

గుడివాడలో టీడీపీ అధ్వర్యంలో రా కదిలి రా కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, చంద్రబాబు కామెంట్స్ కు కొడాలి నాని కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. గుడివాడలో టీడీపీ వర్దంతి సభ నిర్వహించారు.. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడారు.. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశారు అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్, జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 375 ఎకరాలు కొనుగోలు చేశారు.. టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా పేదల కోసం కొనుగోలు చేయలేదు.. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం ఏర్పాటు చేశామని కొడాలి నాని తెలిపారు.

Read Also: Sania Mirza: సానియా మీర్జా విడాకులు.. పోస్ట్ వైరల్ ?

చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించారని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా.. నా సవాల్ స్వీకరించగలరా? అని కొడాలి నాని అన్నారు. నేను గంజాయి మొక్కని కాను.. గుడివాడ ముద్దు బిడ్డని.. టీడీపీ తులసీవనంలో చంద్రబాబే గంజాయి మొక్క.. 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు.. చంద్రబాబువి 420 మాటలు.. టిడ్కో ఇళ్లు కట్టించింది మేమే.. టీడీపీ హయాంలో కేవలం 1200 ఇళ్లు పునాదులు మాత్రమే వేశారు అని ఆయన అన్నారు. చంద్రబాబువన్నీ అబద్దాలే.. ఎన్టీఆరునే గంజాయి మొక్క అన్నాడు చంద్రబాబు.. ఎన్టీఆర్ మంచివాడైతే చంద్రబాబు ఎన్టీఆరును ఎందుకు తొలగించారు.. చంద్రబాబు మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో చెప్పాలి అని కొడాలి నాని ప్రశ్నించారు.

Read Also: Boat Tragedy: 14కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను.. చంద్రబాబు ఎంతటి మోసగాడో అందరికీ చెబుతూనే ఉంటాను.. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు.. బూట్లు నాకుతున్నారు.. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.. చంద్రబాబుకు ఏం కోటాలో పదవి వచ్చింది.. నీతుల కోటాలోనా..? కోతల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? అని కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show comments