NTV Telugu Site icon

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు షాక్‌..! వైసీపీ ఎమ్మెల్సీపై వరుస ఫిర్యాదులు..

Duvvada Srinivas

Duvvada Srinivas

Duvvada Srinivas: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు ఫైర్‌ అవుతున్నారు.. జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై దువ్వాడ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆ పార్టీ శ్రేణులు.. ఓవైపు దువ్వాడకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు.. వరుసగా పోలీస్‌ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీపై ఫిర్యాదులు చేస్తున్నారు..

Read Also: Rajendra Prasad: ‘రాబిన్ హుడ్’తో నితిన్ రేంజ్ మారుతుంది.. భలే గమ్మత్తుగా ఉంటుంది!

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.. ప్రశ్నించకుండా ఉండటానికి 50 కోట్ల రూపాయలు తీసుకున్నాడని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడని.. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు, పెడన, పామర్రు, గుడివాడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.. మరోవైపు.. ఉప ముఖ్యమంత్రి పవన్ పై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చర్య తీసుకోవాలని కోరుతూ జనసేన మహిళా కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డీఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు మహిళా కౌన్సిలర్లు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు.