NTV Telugu Site icon

AP: గంజాయి మత్తులో యువకుల వీరంగం.. హోటల్ నిర్వాహకుడిపై దాడి

Ganja Batch

Ganja Batch

పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా మత్తుగాళ్లకు కళ్లెం వేయలేకపోతున్నారు. మత్తులో తోటి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. తాజాగా.. కృష్ణా జిల్లా పెనమలూరులో ఓ గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. గంజాయి మత్తులో వీరంగం సృష్టించి ఒకరిపై దాడికి తెగబడ్డారు. పెనమలూరు హై స్కూల్ సమీపంలో ఓ హోటల్ నిర్వాహకుడిపై గంజాయి మత్తులో విచక్షణారహితంగా దాడి చేశారు. గంజాయి మత్తులో హోటల్ కి వచ్చిన యువకులు.. డబ్బులు ఇవ్వకుండా సిగరెట్లు తీసుకోవడంతో గొడవ మొదలైంది. అదే గ్రామానికి చెందిన అభిషేక్, దినేష్, దారనిష్, ఇంకొందరు కలిసి దాడి చేశారు.

Read Also: APPSC: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల..

యువకుల దాడిలో హోటల్ నిర్వాహకుడు అబ్రహం (60)కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా.. నిత్యం హై స్కూల్ సమీపంలో యువకులు రాత్రి పగలు తేడా లేకుండా గంజాయి సేవిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కాగా.. బాధితుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read Also: Group 2 Mains: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు.. 92 శాతం హాజరు