NTV Telugu Site icon

Heavy Flood in Krishna River: కృష్ణా నదిలో పోటెత్తుతున్న వరద..! వణికిపోతున్న బెజవాడ వాసులు

Vja 2

Vja 2

Heavy Flood in Krishna River: కృష్ణానది వరద 12 లక్షల క్యూసెక్కులు చేరుతుందనే అంచనా నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డలకు ముప్పు వంచిఉన్న నేపథ్యంలో.. పెరుగుతున్న వరద దెబ్బకి వణికిపోతున్నారు జిల్లా వాసులు.. ఇప్పటికే సిటీలో ఇళ్లను వదిలి వెళ్తున్నారు ప్రజలు.. పామర్రులో పూర్తిగా లంక గ్రామాలు నీటమునిగాయి.. అవనిగడ్డ ఉళ్లిపాలెం వంతెన దగ్గర కట్ట బలహీనం కావడంతో మరమ్మత్తు చర్యలు చేపట్టారు.. వరద నీటి ఉధృతి పెరిగితే ముంపునకు గురవుతమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికే వందల ఎకరాల్లో వాణిజ్య పంటలు నీట మునిగాయి.. అయితే, వర్షం తగ్గుముఖం పడ్డటం.. ఈ రోజు అంతగా వర్షాలు కురవకపోవడంతో.. వరద ఉధృతి తగ్గుతుందని ఆశాభావంతో ఉన్నారు జిల్లా వాసులు.

Read Also: Meta AI: ఆత్మహత్యకుమందు యువతి సోషల్ మీడియాలో పోస్ట్.. పోలీసులకు ఫోన్ చేసి కాపాడిన మెటా ఏఐ

Show comments