NTV Telugu Site icon

Perni Nani: మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?

Perni Nani

Perni Nani

Perni Nani: రేషన్‌ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్నినాని కుటుంబాన్ని వీడడంలో లేదు.. ఇప్పుడు రేషన్ బియ్యం మాయం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ మంత్రి పేర్ని నానిపై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఏ6గా పేర్ని నాని పేరును చేర్చారు.. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తర్వాత పేర్ని నాని పై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.. ఇక, ఈ కేసులో ఏ5గా ఉన్న రైస్ మిల్లర్ బాలాంజనేయులును పేర్ని నానిని కూడా ఇవాళ అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు.. మరోవైపు.. ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు పేర్ని నాని… రేషన్ బియ్యం మాయం వ్యవహారంలో పోలీసులు పెట్టిన కేసులో అరెస్ట్‌ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్‌ కోరుతూ లంచ్ మోషన్ వేశారు పేర్ని నాని.

Read Also: Traffic Rules In Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. అతి చేసారో..?

ఇక, రేషన్ బియ్యం మాయం కేసులో రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చిక్కింది.. ఈ కేసులో ఏ1గా ఉన్న పేర్ని నాని భార్య జయసుధ ఉండగా.. ఏ2గా గోడౌన్ మేనేజర్ మానస తేజను చేర్చారు పోలీసులు.. 2016 నుంచి మాజీ మంత్రి పేర్ని నాని దగ్గర పనిచేస్తున్నారు మానస తేజ.. ఇక, పెడనకి చెందిన లారీ డ్రైవర్ మంగా రావు ఉషోదయ ట్రాన్స్ పోర్ట్ లో లారీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.. గోడౌన్ నుంచి MLS పాయింట్స్ కి మంగారావు పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నట్టు గుర్తించారు.. ఇక, ఏ6 గా పేర్ని నాని పేరు చేర్చారు పోలీసులు.. ఇదే కేసులో పేర్ని నాని భార్యకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే కాగా.. ఇదే సమయంలో విచారణకు సహకరించాలనే ఆదేశాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే..

Show comments