NTV Telugu Site icon

Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. దళారులను ప్రోత్సహించొద్దు..

Nadendla Manohar

Nadendla Manohar

Minister Nadendla Manohar: రైతులకు అండగా ఉంటాం.. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.. కానీ, రైతులు దళారులను ప్రోత్సహించొద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన.. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు.. రైతులతో మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతో 40 రోజులపాటు జరగాల్సిన ప్రక్రియ.. నాలుగు రోజుల్లో చేయాల్సి వస్తుంది. రైతులకు మద్దతుగా.. అధికార యంత్రాంగమంతా రాత్రింబవళ్లు కష్టపడుతుంది. వాతావరణ మార్పులతో రైతులకు మేలు చేకూర్చేలా.. ధాన్యం విక్రయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం అన్నారు..

Read Also: Srishti Tuli: మహిళా పైలట్ మృతి వెనుక మరో మహిళ.. ఆమె ఎవరంటే..!

ఇక, ధాన్యం విక్రయాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు భరోసా కల్పిస్తున్నాం అన్నారు మంత్రి మనోహర్.. రైతులకు నమ్మకం కలిగించేలా.. ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళమని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో.. రైతుల ఖాతల్లో నగదు జమ చేస్తున్నాం. 24 తేమ శాతం ఉన్న ధాన్యం కొనుగోళ్లు చేసేలా మిల్లర్లకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చాం అన్నారు. రైతుల ఆందోళన దృష్టిలో ఉంచుకొని.. సాయంత్రానికల్లా గుడివాడలో 30 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నాం. మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీ ఇబ్బందులు తలెత్తకుండా.. బకాయి నిధులు విడుదల చేశాం. కొత్త ఆలోచనతో 1:2 నిష్పత్తిలో రైతులకు బ్యాంక్ గ్యారంటీ వెసులుబాటు కల్పించాం. రైతు సహాయ కేంద్రాలను సంప్రదిస్తే.. కల్లాల వద్దకే గోనేసంచెలు.. రవాణా వాహనాలను పంపించేలా ఏర్పాటు చేశామన్నారు.. అయితే, రైతులెవరు దళాలను ప్రోత్సహించవద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.