NTV Telugu Site icon

కృష్ణా జిల్లా ఎస్పీ సంచలన వ్యాఖ్యలు.. ఇక రౌడీ షీటర్లకు చుక్కలే..!

రౌడీ షీటర్లకు చుక్కలు చూపించేందుకు సిద్ధం అవుతున్నారు ఏపీ పోలీసులు… కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్.. రౌడీ షీటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రౌడీ షీటర్లకు ప్రభుత్వ పథకాలు అందకుండా చర్యలు తీసుకుంటామంటూ.. కృష్ణా జిల్లాలో రౌడీ షీటర్ల కౌన్సిలింగ్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.. జిల్లా వ్యాప్తంగా రెండు కంటే ఎక్కువ కేసుల్లో ఉన్నవారిని కౌన్సిలింగుకు పిలిపించాం.. రాబోయే రోజుల్లో చేసే స్పెషల్ యాక్షన్ ప్లాన్ వివరించాం.. పాత నేరస్ధులపై నిఘా పెంచుతామని వెల్లడించారు.. ఇక, రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు కూడా తెరుస్తామని ప్రకటించిన ఆయన.. ప్రభుత్వ పథకాలు వారికి రాకుండా వారి లిస్టు ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు.. మొదటిసారి ఇలా పెద్ద మొత్తంలో రౌడీ షీటర్లను పిలిచాం.. ఇప్పుడే కొందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నామని తెలిపారు సిద్ధార్థ్‌ కౌశల్.

ఇక, గంజాయి జిల్లా వ్యాప్తంగా సీజ్ చేస్తున్నామన్నారు ఎస్పీ.. ఈ స్పెషల్ యాక్షన్ ప్లాన్ వెంటనే అమల్లోకి వస్తుందన్న ఆయన.. ఎవరైతే నిజంగా మారారని గుర్తిస్తామో.. వారికి అన్ని సహాయ సహకారాలు ఉంటాయన్నారు. మరోవైపు.. ఉత్తరాంధ్రలో గంజాయి హబ్ ఉంటుందని తెలిసింది.. విశాఖ ప్రాంతంలో గంజాయి పెంచే ప్రదేశాలు గుర్తించి నాశనం చేస్తారని వెల్లడించిన ఆయన.. కృష్ణాజిల్లాలో కూడా అదే విధంగా చేయనున్నట్టు వివరించారు.. నిన్న, మొన్న రెండు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 14 గంజాయి కేసులు పెట్టాం.. దూరంగా విసిరేసినట్టు ఉన్న గ్రామాలకు జియో ట్యాగింగ్ చేస్తున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషనుతో మాట్లాడాం.. జాబ్ మేళా ద్వారా మారిన వారి కుటుంబీకులకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు వెల్లడించారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్‌.