Kothapeta Prabhala Utsavam: మకర సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఉదయం పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వీదుల ప్రభల ఊరేగింపు కొత్తపేట ప్రధాన పురవీధుల్లో సాగింది. ఈ మూడు ప్రధాన వీధుల ప్రభలను అనుసరిస్తూ చిన్న ప్రభలను ఊరేగించారు. ప్రభల ముందు సంగీత నాదస్వర మేళాలు, డప్పు వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు బాణా సంచా కాల్పుల నడుమ ఊరేగింపు ముందుకు సాగింది. ప్రభలను ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో కొలువు దీర్చారు. వేలాది సంఖ్యలో ప్రజలు రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లన్నీ ప్రజలతో కిక్కిరిషిపోయాయి. విశేష సంఖ్యలో భక్తులు దేవత మూర్తులను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు వీధుల వారు నిర్వహించిన పోటా పోటీ బాణా సంచా కాల్పులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.. మరోవైపు.. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Read Also: RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..