NTV Telugu Site icon

Kolusu Parathasarathy : తుఫాను పరిహారం సైతం ఎగ్గొట్టలేదా…?

YCP MLA Kolusu Parthasarathy reacts on TDP Leader Atchannaidu Comments.

టీడీపీ నేత అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కౌంటర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న 30 లక్షల మంది మహిళకు ఇల్లు కట్టిస్తున్నారని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు ప్రాధాన్యం ఇచ్చారు తప్ప రైతులకు కాదని ఆయన అన్నారు. తుఫాను పరిహారం సైతం ఎగ్గొట్టలేదా…? అని ఆయన ప్రశ్నించారు. ఏదన్నా ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తే టీడీపీపై వేయాలని, జగన్మోహన్ రెడ్డి కష్టపడి ఈ కార్యక్రమాలు అమలుకు అప్పులు తెస్తుంటే వాటిని అడ్డుకోవడానికి మీరు కేంద్రం, బ్యాంకుల వద్ద ప్రయత్నం చేయలేదా..? అని ఆయన మండిపడ్డారు.

ఎంతసేపు విధ్వంసం చేయడం తప్ప ఈ రాష్ట్ర బాగు కోసం ఏమైనా చేశారా…? అని, దోపిడీ మాఫియా కోసం ఆఖరికి మహిళా అధికారులను సైతం జుట్టుపట్టుకుని దాడి చేశారన్నారు. ఐదేళ్ల అధికార మదంతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన విషయం ప్రజలు మర్చిపోలేదని, వంచన మాది కాదు.. మేనిఫెస్టోను వెబ్ సైట్ లో కూడా లేకుండా చేయడం వంచన అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పార్టీనా బొక్కా అన్న అచ్చెన్నాయుడే ఛార్జ్ షీట్ వేయడం విడ్డూరంగా ఉందని, తప్పకుండా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి.. అప్పుడు చూద్దాం అచ్చెన్నాయుడు అని సవాల్‌ విసిరారు. అంతేకాకుండా సీపీఐ నారాయణ ఒక జోకర్.. అప్పుడప్పుడు వచ్చేసి కనిపించి వెళుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.