Site icon NTV Telugu

షర్మిల పార్టీపై మంత్రి కొడాలినాని కామెంట్ !

తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు పడలేదని…పోలింగ్ 50 శాతమే నమోదయిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80-90 శాతం గాని జరిగి ఉండాలి… కానీ అలా ఏమి జరగలేదని తెలిపారు మంత్రి కొడాలి నాని. తిరుపతి ఎన్నికలలో వైసిపి ఖచ్చితంగా గెలుస్తుంది…. 4 లక్షల 50 వేల మెజారిటీతో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని. కరోనా నియంత్రణకు లాక్ డౌన్ పరిష్కారం కాదని.. ప్రజలు మాస్కులు ధరించి శానిటైజర్ వాడాలని, సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలంగాణలో తాము దృష్టి సారించలేదని….షర్మిల పెట్టబోతున్న పార్టీపై ఏమి చెప్పలేనని మంత్రి కొడాలి నాని పేర్కొనారు. కాగా తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 17న జరిగిన విషయం తెలిసిందే.

Exit mobile version