వంగవీటి రాధాను పొగడ్తలతో ముంచెత్తారు మంత్రి కొడాలి నాని. వంగవీటి రాధా బంగారమని, కాస్త రాగి కలిపితే… ఎటు కావాలంటే అటు వంగొచ్చన్నా… రాధా ఒప్పుకోలేదని అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టిడిపి నాయకులు చెప్పినా… పదవులు ఆశించకుండా ఆ పార్టీలో చేరారన అన్నారు. తన తమ్ముడు రాధా మేలిమి బంగారమంటూ కొనియాడారు కొడాలి నాని.
ఇది ఇలా ఉండగా… వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపడానికి రెక్కీ నిర్వహించారని.. రంగా కీర్తి ,ఆశయాల సాధనే తప్ప లక్ష్యం,పదవులపై ఆశ లేదని పేర్కొన్నారు. తనను ఏదో చేద్దాము అనుకుని రెక్కీ నిర్వహించారని.. కానీ నేను భయపడనని పేర్కొన్నారు వంగవీటి రాధా.
