Site icon NTV Telugu

రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమ‌రావతి రాజ‌ధాని : కొడాలి నాని

రాజధాని వికేంద్రీకరణ, అమరావతిపై మంత్రి కొడాలి నాని కామెంట్స్ చేశారు. సెక్రటరియేట్ విశాఖలో, హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని… అమరావతి కూడా ఉంటుందని క్లారిటీఇచ్చారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజదాని వికేంద్రీకరణ అని… అమరావతి అందరిది అంటున్న వాడు అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుల ద్వారా అడ్డుకున్నారని చెప్పారు.

https://ntvtelugu.com/paritala-sriram-harsh-criticism/

అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామినీ పూజిస్తే, పరమేశ్వరుడు ఉండే అమరావతిని ఆయన ఆశీర్వదిస్తారని… కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పెట్టిన రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఒక్కటేన‌ని… 30వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అమరావతి ఏర్పాటు చెయ్యాలని నాడు ప్రతి పక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు నేను సిద్ధమని కొడాలి నాని సవాల్ విసిరారు. \తనకు చెందిన వారికి లబ్ది చేకూర్చేందుకే ల్యాండ్ పులింగ్ పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నాడని మండిప‌డ్డారు.

Exit mobile version