Site icon NTV Telugu

Kodali Nani: అపోలో ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని.. ఏమైంది?

kodali nani

Maxresdefault (4)

Kodali Nani: ఏపీలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రి పాలయ్యారు. కిడ్నీలో రాళ్లు చేరి బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. మూడు రోజుల క్రితమే కొడాలి నాని ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కొడాలి నానికి వైద్యులు కిడ్నీ సంబంధిత శస్త్ర చికిత్సను నిర్వహించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రి ఐసీయూలో కొడాలి నాని ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Satyendar Jain: ఆప్ మంత్రి భోగాలు ఆహా.. జైలులోనే మసాజ్‌లు.. వీడియో వైరల్

కాగా రెండు, మూడు రోజుల్లో కొడాలి నాని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రెండు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం అంతా బాగుందనుకుంటే 15 రోజుల తర్వాత కొడాలి నానికి కిడ్నీ సంబంధిత లేజర్ చికిత్సను వైద్యులు చేయనున్నారు.

Exit mobile version