NTV Telugu Site icon

KK Raju: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలి

Kk Raju Electric Rally

Kk Raju Electric Rally

KK Raju Comments In Electric Vehicles Rally: కాలుష్య నివారణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచుకోవాలని నెడ్ క్యాప్ ఛైర్మన్ కేకే రాజు పేర్కొన్నారు. సాంప్రదాయేతర ఇంధన వనరులను అమల్లోకి తీసుకురావడం ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. శనివారం విశాఖపట్నంలో నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లో విద్యుత్ వాహనాల ర్యాలీ నిర్వహించారు. పర్యావరణహితమైన వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ర్యాలీ‌ని నిర్వహించడం జరిగింది. ‘గో గ్రీన్ గో ఎలక్ట్రిక్ బైక్’ నినాదంతో కేకే రాజు ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ.. పర్యావరణహితమైన విధానాలను అవలంభించడంలో ప్రభుత్వం ముందుందని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్‌మెంట్ సమ్మిట్‌లో సాంప్రదాయేతర ఇంధన వనరులకు పెద్ద పీట వేయడం జరిగిందని గుర్తు చేశారు.

Shocking Incident : 20ఏళ్లప్పుడు దొంగతనం చేసి.. 60ఏళ్లకు అరెస్టయ్యారు

ఇదే సమయంలో నెడ్ క్యాప్ ఎండీ రమణా రెడ్డి మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ఖర్చును ఆదా చేయడంతో పాటు కాలుష్య నివారణకు తమ వంతు పాత్ర పోషించినట్టు అవుతుందన్నారు. ఎలక్ట్రిక్ బైకులతో పాటు ఈ-ఆటోలను కూడా ప్రోత్సహిస్తున్నామన్నారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు మాట్లాడుతూ.. ప్రజల్లో కాలుష్య నివారణ పట్ల అవగాహన పెరుగుతోందని చెప్పారు. కార్బన్ కారక కాలుష్య నివారణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే సోలార్ ఫ్లోటింగ్ ప్యానెల్స్ ద్వారా జీవీఎంసీ తన వంతు బాధ్యతను నెరవేరుస్తుందని తెలియజేశారు.

Illicit Affair: కౌన్సిలర్ ప్రియుడి మోజులో పసిబిడ్డల్ని దారుణంగా హతమార్చిన తల్లి..

Show comments