Site icon NTV Telugu

Kishore Satya: సౌత్ లో సప్త జ్యోతిర్లింగ టూర్ ని ప్రారంభించబోతున్నాం..కిషోర్ సత్య

Untitled 2

Untitled 2

Vijayawada: కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని.. పుణ్యక్షేత్రాలను దర్శించాలనే ఆశ మనలో చాలామందికి ఉంటుంది. అలా టూర్ కి వెళ్లాలనే ఆసక్తి ఉన్నవాళ్ళకి రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళ్తే.. రైల్వే టూరిజం డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ సత్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Irctc భారత్ గౌరవ్ టూరిజం ట్రైన్ ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. కాగా ఈ ట్రైన్ న్ని 13 పుణ్యక్షేత్రాలకు టూర్స్ కు నియమించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ నుండి ఇప్పటివరకు 13 డిపార్చర్స్ చేయడం జరిగిందని తెలిపారు. అయితే త్వరలో సౌత్ లో సప్త జ్యోతిర్లింగ టూర్ ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. కాగా 700 నుండి 800 మందితో భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని..స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని యాత్రలో చూపించబోతున్నామని..అతి ప్రాముఖ్యమైన ద్వారక తర్వాత సోమనాథ్ ఆపైన పూనే తీసుకెళ్లాబోతున్నామని పేర్కొన్నారు.

Read also:Hydrogen Powered Car: ఇది కదా కారంటే..? రూ.150 ఖర్చు చేస్తే.. 300 కిలోమీటర్లు వెళ్లొచ్చు..

కాగా 21000 స్లీపర్ క్లాస్ కి. ఛార్జ్ చేస్తున్నామని వెల్లడించిన ఆయన థర్డ్ ఏసి 32,500,సెకండ్ ఏసి 42,500, చార్జ్ చేస్తున్నామని పేర్కొన్నారు. అంటే సుమారుగా రోజుకి 1600 పడుతుందని..13 రోజులు 12 రాత్రులు సాగే ఈ యాత్రకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. బ్రేక్ ఫాస్ట్, లంచ్,డిన్నర్ డైలీ ఏర్పాటు అందిస్తామని.. అలానే ప్రతి కొచ్ కి ఒక సెక్యూరిటీ గార్డ్ ని ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా 18 వ తారీకు యాత్రకు బయలుదేరి 31వ తారీకు కు విజయవాడకు చేరుకుంటామని తెలిపిన ఆయన.. గుంటూరు, తెనాలి, ఒంగోలు చుట్టుపక్క ప్రాంతాలకు తెలియాలని ఈ ప్రెస్ మీట్ ని నిర్వహించాము అని పేరొకొన్నారు. ఫ్లైట్ ప్యాకేజెస్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. Https://irctctourism.com వెబ్సైటు లో మరిన్ని వివరాలను చూడొచ్చు.

Exit mobile version