Site icon NTV Telugu

Agri Gold Scam: అగ్రిగోల్డ్‌ స్కాం కేసులో కీలక పరిణామం..

Agri Gold

Agri Gold

Agri Gold Scam: అగ్రిగోల్డ్‌ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తులను అప్పగించే ప్రక్రియ ప్రారంభం అయింది. అటాచ్‌ చేసిన ఆస్తులను బాధితులకు అప్పగించే అవకాశం ఉంది. అగ్రిగోల్డ్‌కు చెందిన రూ.3,339 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సీజ్‌ చేసింది. ఇక, సీజ్‌ చేసిన ఆస్తుల విలువ మార్కెట్‌ ప్రకారం రూ.6 వేల కోట్లు ఉంటుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుపై ఈడీ విచారణ జరిపింది. 4 రాష్ట్రాల్లో 2,254 ఆస్తులను అటాచ్‌ చేసింది ఈడీ.. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, ఢిల్లీలో ఉన్న ఆస్తులు సీజ్‌ చేయగా.. 32 లక్షల మంది పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసినట్లు గుర్తించింది ఈడీ.

Exit mobile version