ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ వుంటుంది. ఆలయంలో అనేక వసతులు కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా శ్రీశైలంలో ట్రస్ట్ బోర్డ్ ఐదవ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఆలయ ఈవో ఎస్. లవన్న, మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 30 అంశాలతో ప్రతిపాదనలు ప్రవేశపెట్టగా 30 ప్రతిపాదనలను ఆమోదం తెలిపినట్లు చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి తెలిపారు.
అందులో ముఖ్యంగా 39 కోట్ల రూపాయలతో దేవస్థానం సిబ్బందికి వసతి,సిద్దరామప్ప కాంప్లెక్స్ పై అంతస్థులో వసతికి టెండర్లు పిలిచామన్నారు. ఆలయ క్షేత్రపరిధిలోని పలు ప్రధాన కూడళ్ళలో ఎల్ఈడి బల్పులను ఏర్పాటు చేస్తామని ధర్మకర్తల మండలి ఛైర్మన్ వెల్లడించారు. అలాగే, గంగా, గౌరీ సదన్, మల్లికార్జున సదన్లకు జనరేటర్లు ఏర్పాటు, వీటితో పాటు క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ నియంత్రించేందుకు ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. త్వరలోనే క్షేత్రపరిధిలో మంచినీళ్ల బాటిళ్ల స్థానంలో గాజు బాటిళ్లను అందుబాటులోని తీసుకు రానున్నట్లు తెలిపారు. అలానే భక్తుల ద్వారా నూతన డార్మెటరీ నిర్మిస్తామన్నారు.
శ్రీశైల దేవస్థానం అభివృద్ధి కోసం అటవీశాఖ సరిహద్దును గుర్తించి మాస్టర్ ప్లాన్ ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపామన్నారు. అదేవిధంగా శ్రీశైల దేవస్థానంలోని ఉద్యోగులకు గతంలో సున్నిపెంటలో 1200 ప్లాట్లు కేటాయించడం జరిగిందన్నారు. వాటికి రోడ్డు, తాగునీరు, డ్రైనేజీ వసతి ఏర్పాటు చేస్తామని తెలిపారు ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి. ఈ సమావేశంలో ఆలయ ఈవో లవన్న ట్రస్ట్ సభ్యులు అధికారులు పాల్గొన్నారు.
Read Also: Vijay Deverakonda: మా సినిమానే బాయ్‌కాట్ చేస్తారా.. చూసుకుందాం!