NTV Telugu Site icon

ప్రజల సొమ్ముతో ప్రజలనే కొంటున్న ప్రభుత్వం ఇది…

kannaa

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోంది. జగన్ రైతులను గాలికొదిలేశారు. వ్యవసాయాన్ని తుంగలో తొక్కారు అని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవటం లేదు అని తెలిపారు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం సబ్సిడీ ఇస్తున్న రైతులకు మాత్రం పరికరాలు అందించడం లేదు. నీటిపారుదల ప్రాజెక్టులపై శ్వేత పత్రం విడుదల చేయాలి. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం రివర్స్ లో వెలుతుంది. ప్రజల సొమ్ముతో ప్రజలనే కొంటున్న ప్రభుత్వం ఇది.. ధాన్యం కొనుగోలు చేయాలి, కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసారు.