Site icon NTV Telugu

కౌరవ సభను మళ్ళీ గౌరవ సభగా మారుస్తాం: కాల్వ శ్రీనివాసులు


అసెంబ్లీలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపు పని అని టీడీపీపొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీపై విమర్శలు బాణాలు వదిలిన ఆయన.. కౌరవ సభను మళ్ళీ గౌరవ సభగా మారుస్తామన్నారు. చంద్రబాబు కంటతడి జీవితంలో చూడబోమని అనుకున్నాం కానీ వైసీపీ నేతలు దిగజారి చంద్రబాబుపై విమర్శలు చేశారన్నారు. దీనికి వారు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో ధాన్యం కొనుగోలులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. డిసెంబర్ నెలలో గౌరవ సభలకు సంబంధించి కార్యచరణను విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. పోలీసుల వేధింపులపై పోరాడుతున్న వారికి నేతలు అండగా ఉండాలన్నారు. వరద సాయంపై ప్రజలకు అందుతున్న సాయాన్ని టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు వాకబు చేయాలన్నారు. ఈ సమయంలో ప్రజలకు అండగా నిలవాలని కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు.

Exit mobile version